Liquor Depot Accident: మద్యం డిపోలో అగ్ని ప్రమాదం.. అధికారుల లెక్కల్లో భారీ తేడా.. అసలు కథేంటంటున్న జనాలు..!

Liquor Depot: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఎక్స్‌రోడ్‌ ఐఎంఎల్‌ బేవరేజ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మద్యం డిపోలో ఐదు రోజుల క్రితం అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే

Liquor Depot Accident: మద్యం డిపోలో అగ్ని ప్రమాదం.. అధికారుల లెక్కల్లో భారీ తేడా.. అసలు కథేంటంటున్న జనాలు..!
Utnoor
Follow us

|

Updated on: Oct 31, 2021 | 9:50 AM

Liquor Depot: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఎక్స్‌రోడ్‌ ఐఎంఎల్‌ బేవరేజ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మద్యం డిపోలో ఐదు రోజుల క్రితం అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అయితే, ప్రమాదం సంభవించి నాలుగు రోజులవుతున్నా డిపోలో మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. డిపోలో ఉన్న మద్యం సీసాలు పగులుతూనే ఉన్నాయి. కాగా, అగ్ని ప్రమాదంలో మద్యం కింద పడిపోవడం తదితర కారణాలతో దూర్వాసన వస్తోంది. సీసాలు పేలుతున్న శబ్ధాలు, మద్యం దుర్వాసనతో కూడిన పొగ వస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. ప్రమాదంలో సంభవించిన నష్టం అంచనాలపై అధికారులు ప్రకటించిన లెక్కలు ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. అగ్ని ప్రమాద ఘటనలో కాలిపోయిన మద్యం ఎంత? దాని విలువ ఎంత? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అగ్ని ప్రమాద లెక్కల్లో గందరగోళం కారణంగా ఈ ప్రశ్నలు వస్తున్నాయి. డిపో రికార్డుల ప్రకారం.. ఈనెల 26వ తేదీ వరకు మద్యం నిల్వల ముగింపు నిలువ రూ. 11.96 కోట్లు చూపారు అధికారులు. అయితే, ప్రమాద సమయంలో డిపో నుంచి రూ. 60 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు మద్యం సీసాలను సేవ్ చేశారు సిబ్బంది. సురక్షితంగా బయటకు తీసిన మద్యంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ, ప్రమాదంలో రూ. 10 నుంచి 12 కోట్ల నష్టం జరిగిందని అధికారులు పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రమాదాన్ని అడ్డుపెట్టుకుని అధికారులు గోల్‌మాల్‌కు పాల్పడుతున్నారా? లేక ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే అనుమానాలు లేవనెత్తుతున్నాయి. మరి ఉన్నతాధికారులు దీనిపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Also read:

Gold ETF: ఈ దీపావళికి గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెడితే మంచిది.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

స్లిమ్‌గా కొరియ‌న్ మ‌హిళ‌లు వారి ఫిట్‌నెస్‌ ర‌హ‌స్యం ఏంటి..?? వీడియో

భార్యతో గొడవ పడలేను.. నన్ను జైల్లో పెట్టండి.. వీడియో

అవి పికాసో చిత్రరాజాలు .. అందుకే రూ. 817 కోట్లు పలికాయి.. వీడియో