MLC Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మళ్లీ మోగిన ఎన్నికల నగారా.. ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల..
MLC Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానికలకు ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్..

Andhra Pradesh-Telangana MLC Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానికలకు ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఎమ్మెల్యే కోటా కింద తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో 3 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించిన షెడ్యూల్ నోటిఫికేషన్ జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 29న పోలింగ్, కౌటింగ్ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కాగా, ఎన్నికల నిర్వహణకు సంబంధించి నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. 22న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. 29వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజు కౌంటింగ్ కూడా నిర్వహిస్తారు.
అయితే, తెలంగాణలో ఆకుల లలిత, మహ్మద్ ఫరూద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, వెంకేటశ్వర్లు, కడియం శ్రీహరి పదవీకాలం జూన్ 3 వ తేదీ నాటికే ముగిసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో సోము వీర్రాజు, చిన్న గోవిందరెడ్డి, మహ్మద్ షరీఫ్ పదవీకాలం మే 31వ తేదీ నాటికి ముగిసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, తాజా నోటిఫికేషన్‌తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఆశావహ నేతలు ఇప్పటికే మంతనాలు మొదలుపెట్టారు. మరి ఇరు రాష్ట్రాల్లో ఎవరికి ఛాన్స్ లభిస్తుంది? ప్రస్తుతం ఉన్న వాళ్లకే రెన్యూవల్ చేస్తారా? కొత్తవారికి అవకాశం ఇస్తారా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Also read:
Hyderabad: నీలోఫర్ ఆసుపత్రిలో దారుణం.. రూ.100 కోసం బాలుడి ప్రాణం తీసిన వార్డ్‌బాయ్..
Teeth Pain: మీరు స్వీట్ తింటుంన్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి.. పంటినొప్పి రాకుండా చేసుకోండి..