AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teeth Pain: మీరు స్వీట్ తింటుంన్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి.. పంటినొప్పి రాకుండా చేసుకోండి..

పండుగల సీజన్ వచ్చేసింది. పండుగ సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి అందరు సిద్ధమయ్యారు. దీపావళికి చాక్లెట్లు, స్వీట్లను బహుమతిగా అందజేస్తారు. చాకెట్లు, స్వీట్లు అంటే అందరికి ఇష్టమే కాదా.. వాటిని తిని తర్వాత పంటినొప్పి వస్తుందని తరచుగా ఫిర్యాదులు చేస్తుంటారు...

Teeth Pain: మీరు స్వీట్ తింటుంన్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి.. పంటినొప్పి రాకుండా చేసుకోండి..
Teeth
Srinivas Chekkilla
|

Updated on: Oct 31, 2021 | 11:19 AM

Share

పండుగల సీజన్ వచ్చేసింది. పండుగ సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి అందరు సిద్ధమయ్యారు. దీపావళికి చాక్లెట్లు, స్వీట్లను బహుమతిగా అందజేస్తారు. చాకెట్లు, స్వీట్లు అంటే అందరికి ఇష్టమే కాదా.. వాటిని తిని తర్వాత పంటినొప్పి వస్తుందని తరచుగా ఫిర్యాదులు చేస్తుంటారు. అందుకే వేడుకల్లో ఏదైనా తినేటప్పుడు మీ ఆరోగ్యంపై అశ్రద్ధ వహించకూడదు. “చక్కెర, కృత్రిమ స్వీటెనర్లు అధిక ఆమ్ల ఆహారాలు దంతాల ఎనామెల్‌ను మృదువుగా చేస్తాయి. ఆమ్ల ఆహారాన్ని తిన్న వెంటనే బ్రష్ చేయడం వలన ఎనామెల్ దెబ్బతింటుంది. ప్రతికూల ప్రభావాలను నివారించడానికి దాదాపు 30 నిమిషాల తర్వాత పళ్లు తోముకుంటే మంచింది. దినచర్యలో బ్రషింగ్‌ను చేర్చుకోవడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయడం మంచింది. పండుగ సమయంలో దంతాలు, చిగుళ్లను రక్షించుకోవడానికి దంతవైద్యులు టిప్స్ సూచిస్తున్నారు

దంత ఆరోగ్య నియమాన్ని అనుసరించాలి పండుగ సమయాల్లో, ప్రజలు తమకు కావాల్సిన దానికంటే ఎక్కువగా ఎంజాయ్ చేసి వారి ప్రస్తుత దినచర్యను కొనసాగించడంలో విఫలమవుతారు. వేడుకల సమయంలో కూడా ప్రజలు ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయడం, పళ్లు తోముకోవడం వంటి ప్రాథమిక దినచర్యను అనుసరించాలి.

మంచి టూత్ బ్రష్ ఉపయోగించండి నోటి పరిశుభ్రత కోసం మంచి టూత్ బ్రష్‌ను ఉపయోగించడం మంచిది. అలాగే, ప్రతి రెండు మూడు నెలలకోసారి లేదా వైరల్ వంటి ఏదైనా అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత బ్రష్‌ను మార్చుకోవాలి.

హైడ్రేటెడ్‎గా ఉండండి శరీరాన్ని హైడ్రేట్‎గా ఉంచుకోవడం చాలా అవసరం. పండుగ సమయాల్లో కూడా, స్వీట్లకు తినకముందు తిన్న తరువాత నీరు తాగాలి.

దంతాలు నమలడం కోసమే దంతాలు నమలడం కోసం మాత్రమేనని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. చాలా మంది పళ్లతో సీసాలు తెరవడం చేస్తుంటారు. అది మంచిది కాదు.

Read Also.. పసుపుతో కాన్సర్‌కు చెక్‌.. కానీ..! కొనసాగుతున్న పరిశోధనలు.. వీడియో