పసుపుతో కాన్సర్‌కు చెక్.. కానీ..! కొనసాగుతున్న పరిశోధనలు.. వీడియో
ప్రాచీనకాలం నుంచి పసుపు మానవ జీవితాలతో ముడిపడి ఉంది. తాపనివారణ నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ వరకు ఎన్నో ఔషధగుణాలు పసుపులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు.
ప్రాచీనకాలం నుంచి పసుపు మానవ జీవితాలతో ముడిపడి ఉంది. తాపనివారణ నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ వరకు ఎన్నో ఔషధగుణాలు పసుపులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. ఐతే తాజాగా వివిధ రకాల క్యాన్సర్‌లకు చికిత్స చేయడానికి, వ్యాధి తీవ్రతను తగ్గించడంలో పసుపు ఏ విధంగా ప్రభావం చూపుతుంతో తెలుసుకునేందుకు అధ్యయనాలపై దృష్టిసారించారు పరిశోధకులు. దీర్ఘకాలిక తాపం, క్యాన్సర్ అభివృద్ధికి మధ్య సహసంబంధం ఉన్నందువల్ల, పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు.. ఈ వ్యాధితో పోరాడగలవని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 2019లో న్యూట్రియంట్స్ అనే సైంటిఫిక్ జర్నల్ ప్రచురించిన నివేధికలో కూడా.. పసుపు రొమ్ము క్యాన్సర్ కణాల విస్తరణను నిరోధిస్తుందని, కణితి పెరుగుదల మందగించేలా ప్రేరేపిస్తుందని పేర్కొంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Latest Videos
వైరల్ వీడియోలు