Manmohan Singh: ఎయిమ్స్‌ ఆస్పత్రి నుంచి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ డిశ్చార్జ్‌..

Manmohan Singh: దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి మన్మోహన్ సింగ్..

Manmohan Singh: ఎయిమ్స్‌ ఆస్పత్రి నుంచి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ డిశ్చార్జ్‌..
Manmohan Singh
Follow us
Subhash Goud

|

Updated on: Oct 31, 2021 | 10:46 PM

Manmohan Singh: దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి మన్మోహన్ సింగ్ డిశ్చార్జి అయ్యారు. ఈనెల 13న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. ఆ తర్వాత డెంగీ నిర్ధారణ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి నుంచి మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లోనే ఉండి చికిత్స పొందుతుతున్నారు. ఇక తాజాగా ఆదివారం రాత్రి ఎయిమ్స్ వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కాగా ఎయిమ్స్ ఆస్పత్రిలోని కార్డియో న్యూరో సెంటర్​లోని ప్రైవేట్ వార్డులో మన్మోహన్ సింగ్‌కు చికిత్స అందించారు వైద్యులు. కాగా మన్మోహన్ ఆస్పత్రి డిశ్చార్జ్ కావడంతో ఆయన కుటుంబంతో పాటు కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌ మాసంలో కరోనా వైరస్ బారిన పడిన మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నెల రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత మన్మోహన్ డిశ్చార్జ్ అయ్యారు.

కాగా, మన్మోహన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మాజీ మంత్రి అశ్వని కుమార్, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సహా పలువురు హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లో చేరిన తర్వాతి రోజు రాహుల్ గాంధీ హాస్పిటల్ వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రెండు సార్లు ప్రధానమంత్రిగా సేవలందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు అన్ని పార్టీల నుంచి అభిమానులున్నారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, నిర్ణయాలపై ప్రశంసలు అందుకున్నారు.

ఇవి కూడా చదవండి:

నగర శివారులో పేకాట క్లబ్‌.. నడిపిస్తున్నది ఎవరో తెలిస్తే షాకవుతారు.. పోలీసుల విచారణలో సంచలన నిజాలు

Encounter: అడవిలో తుపాకుల మోత.. పోలీసులకు.. మావోయిస్టులకు ఎదురు కాల్పులు.. ముగ్గురు మహిళా మావోల మృతి