AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెంచిన ప్రేమతో.. పెంపుడు కుక్కకు దశదిన కర్మ..! ఊరంతా భోజనాలు..

కుటుంబ సభ్యుడిగా పెరిగిన కుక్క మృతి చెందడంతో ఇంటిల్లిపాది తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుక్కకు అంతిమ సంస్కారాలు నిర్వహించి దానిపై వారికున్న ప్రేమను చాటుకున్నారు. అంతిమ సంస్కారాలు నిర్వహించి చేతులు దులుపుకోలేదు.. మనిషి చనిపోతే ఎలా దశదినకర్మ నిర్వహించి పిండ ప్రధానం చేస్తారో.. ఈ పెంపుడు కుక్కకు కూడా అదే విధంగా దశదిన కర్మ కార్యక్రమాలు నిర్వహించారు.

పెంచిన ప్రేమతో.. పెంపుడు కుక్కకు దశదిన కర్మ..! ఊరంతా భోజనాలు..
Dashadinakarma For A Pet Dog
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jul 08, 2024 | 7:44 PM

Share

పెంచిన ప్రేమతో పెంపుడు మరణాన్ని తట్టుకోలేకపోయింది ఒక కుటుంబం. ఇల్లు ఇళ్లంతా కన్నీళ్లు పెట్టుకుంది. కన్నీరుమున్నీరుగా ఏడుస్తూనే ఆ కుక్కకు అంత్యక్రియలు నిర్వహించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆ పెంపుడు కుక్కకు అంతిమ సంస్కారాలు నిర్వహించడమే కాకుండా, దశదిన కర్మ కూడా జరిపించారు. బంధుమిత్రులను పిలిపించి భోజనాలు పెట్టించారు. కుక్కకు అంతిమ సంస్కారాలు దశదినకర్మ నిర్వహించడం చూసి ఊరంతా నివ్వెర పోయారు. ఈ విచిత్ర సంఘటన హనుమ కొండ జిల్లా దర్గా కాజీపేటలో జరిగింది.

స్థానికంగా నివాసం ఉంటున్న గుండాల వెంకటేష్ కుటుంబం కొద్ది రోజులుగా ఓ కుక్కను పెంచుకుంటున్నారు. అనారోగ్యం బారిన పడిన ఈ పెంపుడు కుక్క పదిరోజుల క్రితం మృతి చెందింది..కుటుంబ సభ్యుడిగా పెరిగిన కుక్క మృతి చెందడంతో ఇంటిల్లిపాది తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుక్కకు అంతిమ సంస్కారాలు నిర్వహించి దానిపై వారికున్న ప్రేమను చాటుకున్నారు. అంతిమ సంస్కారాలు నిర్వహించి చేతులు దులుపుకోలేదు.. మనిషి చనిపోతే ఎలా దశదినకర్మ నిర్వహించి పిండ ప్రధానం చేస్తారో.. ఈ పెంపుడు కుక్కకు కూడా అదే విధంగా దశదిన కర్మ కార్యక్రమాలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

దశదిన కర్మ నిర్వహించి బంధువులు, జంతు ప్రేమికులను ఆహ్వానించి సహపంక్తి భోజనాలు పెట్టించారు. పెంపుడు కుక్క పై ఈ కుటుంబం చూపిన మమకారాన్ని చూసి ప్రతి ఒక్కరూ నివ్వేరపోయారు..ఆ పెంపుడు కుక్కకు నిర్వహించిన అంతిమ సంస్కారాలు, దశదశ కర్మ నిర్వహించిన తీరుపై స్థానికులలో చర్చనీయాశంగా మారింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..