AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడెవడ్రా బాబు.. గర్ల్ ఫ్రెండ్‌ను మెయింటేన్‌ చేసేందుకు కంత్రి ప్లాన్‌.. కట్‌చేస్తే.. ఊహించని షాక్!

ప్రేమలో పడ్డ ఒక యువకుడు తన గల్‌ఫ్రెండ్‌ను మెయింటెన్‌ చేయడానికి చైన్ స్నాచింగ్ చేయడం స్టార్ట్‌ చేశాడు. మొదటి స్నాచింగ్స్ తర్వాత అత్యాశ పుట్టడంతో.. ఇదేదో బాగుందనుకున్నాడు.. అదే పనిగా పెట్టుకొని నాలుగు నెలల వ్యవధిలో పదిమంది మహిళల మెడలోని పుస్తెలతాళ్లు తెంచుకుపోయాడు. కానీ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో వెలుగు చూసింది.

వీడెవడ్రా బాబు.. గర్ల్ ఫ్రెండ్‌ను మెయింటేన్‌ చేసేందుకు కంత్రి ప్లాన్‌.. కట్‌చేస్తే.. ఊహించని షాక్!
Warangal Crime
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Aug 26, 2025 | 4:08 PM

Share

వరంగల్ కమిషనర్ పరిధిలో గత నాలుగు నెలలనుండి చైన్ స్నాచింగ్స్ లు కలకలం రేపాయి.. నగర శివారులో మహిళలు ఒంటరిగా వెళ్లాలంటే వనికిపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మహిళా రైతులును టార్గెట్ చేసి వరస దోపిడీలతో హల్చల్ చేశారు. వరుస దోపిడీలు అంతర్ రాష్ట్ర దొంగలపని కావచ్చని అంతా భావించారు. కానీ పోలీసుల విచారణలో నీవ్వేరపోయే నిజాలు బయటపడ్డాయి. ఎట్టకేలకు ఆ చైన్ స్నాచర్‌ను పట్టుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 250 గ్రాములపైగా బంగారు పుస్తెల తాళ్ళు, 3 బైక్స్ స్వాదీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.

కాగా నిందితుడు హనుమకొండ జిల్లా ఎక్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన హరీష్‌గా పోలీసులు గుర్తించారు. ఇతను ఏడాది క్రితం యువతితో ప్రేమలో పడ్డాడని.. ఆమెను మెయింటైన్ చేయడానికి చేతిలో డబ్బు లేకపోవడంతో చైన్ స్నాచింగ్ చేయడం మొదలు పెట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తెలింది. ఆ బంగారు గొలుసు తాకట్టుపెట్టి కొంత డబ్బు తీసుకొని ఆ డబ్బుతో జల్సాగా తిరిగాడని.. ఆ తర్వాత అతని ఆశ అత్యాశగా మారి.. ఇదేదో బాగుందనుకొని ఇదే వృత్తిగా ఎంచుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు నాలుగు నెలల వ్యవధిలో మూడు బైక్‌లు దొంగలించి అవే బైక్స్ పై వెళ్లి చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.

చైన్ స్నాచర్ హరీష్ ను అరెస్టు చేసిన పోలీసులు ఇతని వద్ద 237 గ్రాముల బంగారం, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.. నిందితుడిని మీడియా ముందు హాజరు పరిచిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్. రిమాండ్‌కు తరలించారు.. ప్రేమ వ్యవహారమే ఇతని చైన్ స్నాచర్ గా మార్చిందని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.