Telangana: వరంగల్ MGM ఆసుపత్రిలో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. అదే రీజన్ !
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పిజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టిస్తుంది. పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో పరిస్థితి సీరియస్‌గా ఉంది.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. అనస్తీషియా విభాగంలోని పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి సూసైడ్ అటెంప్ట్ చేసింది. హానికరమైన ఇంజెక్షన్ తీసుకుని ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో వరంగల్ MGMలో చికిత్స అందించారు. ఐతే ఆమె పరిస్థితి విషమంగా మారడంతో..మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు.
బాధితురాలు ప్రీతి రైల్వే ఉద్యోగి కుమార్తె. సైఫ్ అనే సీనియర్ పీజీ విద్యార్థి వేధింపులే.. ఆత్మహత్యాయత్నానికి కారణమని తెలుస్తోంది. సీనియర్ విద్యార్థి ర్యాగింగ్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తండ్రి. రంగంలోకి దిగిన పోలీసులు.. ఇప్పటికే వేధింపులకు గురిచేసిన వైద్య విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ప్రీతికి అన్ని రకాల చికిత్సలు చేశామన్నారు డాక్టర్ చంద్రశేఖర్. ఉదయం గుండెలో నొప్పి అని చెప్పిందని..అంతా కలిసి సేవ్ చేసేందుకు ప్రయత్నించామన్నారు. ప్రీతి ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యాయని..పేరెంట్స్ అనుమతితో నిమ్స్‌కి తరలించినట్టు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..