Telangana: బ్యాంక్ లోన్ పొందిన తొలి ట్రాన్స్ జెండర్ ఈమెనే.. ఆ పథకం ద్వారా రూ.5లక్షలు..
సమాజంలో ఆడా మగా మాత్రమే కాకుండా థర్డ్ జెండర్ ( ట్రాన్స్ జెండర్స్ ) కూడా ఉన్నారు. అందరితో సమానంగా జీవించే హక్కు వారికీ ఉంది. కానీ.. సొసైటీలో చాలా మందికి వారంటే చిన్న చూపు....
సమాజంలో ఆడా మగా మాత్రమే కాకుండా థర్డ్ జెండర్ ( ట్రాన్స్ జెండర్స్ ) కూడా ఉన్నారు. అందరితో సమానంగా జీవించే హక్కు వారికీ ఉంది. కానీ.. సొసైటీలో చాలా మందికి వారంటే చిన్న చూపు. చాలా చులకనగా చూడడమే కాకుండా అవహేళన చేస్తుంటారు. పని చేసుకునేందుకూ అవకాశం లభించదు. వీరి పరిస్థితులను గమనించిన ప్రభుత్వం.. వీరికి అందరితో పాటు సమాన అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే తెలంగాణలో తొలిసారిగా ఓ ట్రాన్స్ జెండర్ కు రూ.5 లక్షలు మంజూరు చేసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ట్రాన్స్ జెండర్ కు రూ.5 లక్షలు రుణం మంజూరైంది. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద స్వయం ఉపాధి యూనిట్ కోసం ఈ మొత్తాన్ని మంజూరు చేశారు. కరీంనగర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆశాకు రూ.5 లక్షల సబ్సిడీ రుణం ఇచ్చారు.
బ్యాంకు నుంచి వచ్చిన లోన్ తో స్వయం ఉపాధి పొందేందుకు చక్కని అవకాశం ఏర్పడిందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ రూ.5 లక్షల చెక్కును ఆశాకు అందజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని శాస్త్రినగర్‌కు చెందిన ఆశా.. కరీంనగర్‌కు వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఫోటోగ్రఫీపై ఉన్న ఇష్టంతో 2017 నుంచి ఆదర్శనగర్‌లో ఫోటో స్టూడియో నడుపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..