Power Outage: ఎంజీఎం ఆస్పత్రిలో పవర్ కట్.. సెల్ఫోన్ లైట్స్ వెలుగులో చికిత్స.. కోతులే ఈ దుస్థికి కారణమా?
ఉత్తర తెలంగాణ జిల్లాలకు గుండెకాయ లాంటి ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోగులు దాదాపు రెండు గంటల పాటు ఊపిరి బిగ పట్టుకున్నంత పనైంది. ఎంజీఎం సిబ్బంది అయోమయంతో పరుగులు పెట్టారు. రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చిమ్మ చీకట్లోనే వైద్యం అందించారు. ఐతే ఉరుకులు పరుగులు చేసిన ఎంజీఎం సిబ్బంది చివరకు కోతుల నిర్వాకం వల్ల జరిగిన సమస్యను గుర్తించి చక్కదిద్దారు.
వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిలో కోతుల చేష్టలు రోగులకు ఊహించని ఆవస్థలు తెచ్చిపెట్టాయి. శుక్రవారం అర్థరాత్రి దాదాపు రెండు గంటలపాటు ఆ పెద్దాసుపత్రిని కారు చీకట్లు కమ్ముకున్నాయి. పవర్ కట్ అవడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు, సిబ్బంది పరుగులు పెట్టారు. వైద్యులు టార్చ్ లైట్ వెలుగుల్లో వైద్యం అందించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు గుండెకాయ లాంటి ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోగులు దాదాపు రెండు గంటల పాటు ఊపిరి బిగ పట్టుకున్నంత పనైంది. ఎంజీఎం సిబ్బంది అయోమయంతో పరుగులు పెట్టారు. రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చిమ్మ చీకట్లోనే వైద్యం అందించారు..
ఐతే ఉరుకులు పరుగులు చేసిన ఎంజీఎం సిబ్బంది చివరకు కోతుల నిర్వాకం వల్ల జరిగిన సమస్యను గుర్తించి చక్కదిద్దారు. ఎంజీఎం ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగం వెనుకాల ఏఎంసీకి వెళ్లే దగ్గర కోతులు విద్యుత్తు స్తంభాల తీగలపై అటు ఇటు దూకడంతో తీగలు ఒకదానికి ఒకటి రాసుకొని మంటలు లేచి ట్రాన్స్ఫార్మర్ పేలి పోయింది. అందులో నుంచి మంటలు వచ్చి విద్యుత్తు సరఫరా నిలిచి పోయింది. దీంతో ఆసుపత్రిలోని అత్యవసర విభాగం, ఏఎంసీ, నవజాతశిశు సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్సీయూ), ఆర్ ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లలో అంధకారం నెలకొని రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అత్యవసర రోగులకు చికిత్స అందించడానికి వైద్యులకు సైతం అవస్థలు తప్పలేదు. నవజాతశిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స పొందుతున్న శిశు వులకు ఆక్సిజన్ అందుతుందో లేదో తెలియక తల్లిదండ్రులు వార్డు బయట ఆందోళన చెందారు. ఆక్సిజన్ వెంటిలేటర్లు, నవజాతశిశు సంరక్షణ కేంద్రంలోని ఇంక్యుబేటర్లకు విద్యుత్తు సరఫరా లేనప్పుడు యంత్రపరికరాలు పనిచేసేలా బ్యాటరీ బ్యాకప్ ఉండాలి. అలాంటివి ఏవీ లేకపోవడంతో రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.. ఆత్యవసర సమయంలో విద్యుత్తును అందించడానికి ప్రత్యామ్నాయంగా జనరేటర్లు ఉన్నా ఆవి పనిచేయక పోవడం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
విద్యుత్తు సరఫరా నిలిచిపోయిన విషయం తెలుసుకున్న ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్ చంద్రశేఖర్ ఆదేశాలతో ఆర్ఎంవో డాక్టర్ మురళి, ఇతర వైద్యాధికారులు ఆసుపత్రికి చేరుకొని ఎన్పీడీసీఎల్ అధికారులను పిలిపించి మరమ్మతులు చేపట్టారు. మరోవైపు రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..