AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sajjanar: సామాన్యుడిపై సజ్జనార్ పొగడ్తల వర్షం… ఇంతకీ ఆయన ఏం చేశారంటే..

సజ్జనార్‌ సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆర్టీసీ తీసుకుంటున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకుంటారు. అలాగే ప్రజలు చేస్తున్న తప్పుల విషయంలోనూ సోషల్‌ మీడియా వేదికగానే సుతిమెత్తగా హెచ్చరిస్తుంటారు. మొన్నటి మొన్న ఓ మహిళా కండక్టర్‌కు జరిగిన అవమానంపై కాస్త ఘాటూగానే స్పందించారు సజ్జనార్‌. అలాగే రోడ్డు భద్రత విషయంలోనూ ప్రజల్లో అవగాహన కల్పించేలా...

Sajjanar: సామాన్యుడిపై సజ్జనార్ పొగడ్తల వర్షం... ఇంతకీ ఆయన ఏం చేశారంటే..
Sajjanar
Narender Vaitla
|

Updated on: Dec 30, 2023 | 9:52 AM

Share

తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు సజ్జనార్‌. ఒకప్పుడు పోలీస్ బాస్‌గా ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఎండీగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. తనదైన నిర్ణయాలతో ఆర్టీసీలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. కార్గో మొదలు పెళ్లి బస్సుల వరకు ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ఆర్టీసీని లాభాల బాట పట్టించారు.

ఇక సజ్జనార్‌ సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆర్టీసీ తీసుకుంటున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకుంటారు. అలాగే ప్రజలు చేస్తున్న తప్పుల విషయంలోనూ సోషల్‌ మీడియా వేదికగానే సుతిమెత్తగా హెచ్చరిస్తుంటారు. మొన్నటి మొన్న ఓ మహిళా కండక్టర్‌కు జరిగిన అవమానంపై కాస్త ఘాటూగానే స్పందించారు సజ్జనార్‌. అలాగే రోడ్డు భద్రత విషయంలోనూ ప్రజల్లో అవగాహన కల్పించేలా కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తూ, వాటికి ఆసక్తికరమైన క్యాప్షన్స్‌ను జోడిస్తూ, ప్రజలను ఆలోజింపజేస్తుంటారు సజ్జనార్‌.

ఈ క్రమంలోనే తాజాగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ వేదికగా ఓ వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన డి. రమేశ్‌ చేసిన పనిని పొగుడుతూ ఓ పోస్ట్ చేశారు. ఇంతకీ ఎవరీ రమేశ్‌ ఆయన చేసిన పని ఏంటంటే.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని దుబ్బచర్చకు చెందిన డి. రమేశ్‌ కుమార్‌ వ్యవసాయం చేస్తుంటాడు. రోడ్డు ప్రమాదాల కారణంగా జరుగుతోన్న మరణాలు చూసిన ఆయన ఉచితంగా హెల్మెట్స్‌ను పంచడం ప్రారంభించారు. ఈ కార్యక్రమాంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కూడా భాగస్వామం చేయడంతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ పోస్ట్ చేశారు.

సజ్జనార్ ట్వీట్..

ఈ సందర్భంగా ‘ఎక్స్‌’లో ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘హెల్మెట్‌ లేని కారణంగా ఎందరో బైకర్స్‌ దుర్మరణం చెందుతున్నారు. అలా ఎవరూ మరణించకూడదనే ఉద్దేశంతో హెల్మెట్‌లను పంచుతున్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచర్లకు చెందిన డి.రమేశ్‌ కుమార్‌ గారు. గత వారం రోజులుగా 150 హెల్మెట్‌ లను ఆయన పంచారు. వ్యవసాయం చేసుకుంటూనే త‌న సొంత డ‌బ్బుల‌తో హెల్మెట్‌లు కొని.. అవ‌స‌రం ఉన్న వారికి పంపిణీ చేస్తుండటం ఆదర్శనీయం. ఈ సామాజిక సేవా కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు డి.రమేశ్‌ కుమార్‌ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు. మరో వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టేందుకు రమేశ్‌ చేస్తున్న పని నిజంగా అభినందించతగినదే కదూ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..