Hyderabad: రైల్వే ట్రాక్‌పై స్నేహితుల మధ్య గొడవ.. అప్పుడే దూసుకొచ్చిన ట్రైన్.. చివరకు..
హైదరాబాద్, డిసెంబర్ 30: వారంతా ఫ్రెండ్స్.. మద్యం తాగడం, గాంజాయ్ పీల్చడం వారి హాబీ.. తరచూ గొడవలు పడుతుంటారు.. ఈ క్రమంలోనే వారి మధ్య మళ్లీ వివాదం మొదలైంది.. దీంతో రైలు పట్టాలపైకి వెళ్లారు.. అక్కడ ఘర్షణ పడ్డారు.. ఇదే క్రమంలో రైలు దూసుకొచ్చింది.. దీంతో ట్రైన్ ఢికొని.. ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్‌లో కలకలం రేపింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. రైలు పట్టాలపై కొంతమంది గొడవ […]
హైదరాబాద్, డిసెంబర్ 30: వారంతా ఫ్రెండ్స్.. మద్యం తాగడం, గాంజాయ్ పీల్చడం వారి హాబీ.. తరచూ గొడవలు పడుతుంటారు.. ఈ క్రమంలోనే వారి మధ్య మళ్లీ వివాదం మొదలైంది.. దీంతో రైలు పట్టాలపైకి వెళ్లారు.. అక్కడ ఘర్షణ పడ్డారు.. ఇదే క్రమంలో రైలు దూసుకొచ్చింది.. దీంతో ట్రైన్ ఢికొని.. ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్‌లో కలకలం రేపింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. రైలు పట్టాలపై కొంతమంది గొడవ పడుతున్న సమయంలో ఒక్కసారిగా రైలు ఢీకొడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన తర్వాత మరి కొంతమంది అక్కడ నుంచి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న భవాని నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి.. వివరాలు సేకరించారు. రైల్వే పోలీసులు కూడా అక్కడికి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రైల్వే ట్రాక్‌పై తరచూ మద్యం, గంజాయి మత్తులో గొడవలు, దాడులతో.. హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. సమాచారం అందుకున్న ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే, ఎంబీటీ పార్టీ నేతలు మృతుల కుటుంబసభ్యులను కలిసి ఓదార్చే ప్రయత్నం చేశారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి నిజానిజాలు బయటపెట్టాలని పోలీసులకి విజ్ఞప్తి చేశారు.
వీడియో చూడండి..
గంజాయ్, మద్యం తాగి కొందరు తరచూ గొడవలకు పాల్పడుతున్నారని.. ఈ క్రమంలో హత్యలు జరగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కాగా.. ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..