మీకేం పోయేకాలంరా బాబు..! డుప్లికేట్ టీవీలు అమ్ముతున్న గ్యాంగ్.. గుట్టురట్టు చేసిన పోలీసులు
Vikarabad District: నవాబ్ పేట మండలం పులుమామిడి దగ్గర వాహనాల తనిఖీల సమయంలో ఈ ముఠా సభ్యులు పట్టుబడ్డారు. ఒక కారుతో పాటు రెండు యాక్టివా వాహనాలపై సోనీ కంపెనీకి చెందిన టీవీలు పెట్టుకొని తిరుగుతుండగా అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీశారు. నాసిరకం టీవీలు తీసుకొచ్చి సోనీ కంపెనీ సాఫ్ట్‌వేర్ వేసి ప్రజలకు అమ్ముతూ మోసం చేస్తున్నట్లు తేల్చారు.

డుప్లికేట్ టీవీలు విక్రయిస్తున్న ముఠాకు చెక్ పెట్టారు నవాబ్ పేట పోలీసులు. తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఢిల్లీ నుంచి ఇద్దరు ఈ ముఠాను నడిపిస్తున్నారన్నారు డీఎస్పీ. బ్రాండెడ్ కంపెనీ టీవీల పేరుతో డుప్లికేట్ టీవీలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు వికారాబాద్ జిల్లా నవాబ్ పేట పోలీసులు. తొమ్మిది మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
నవాబ్ పేట మండలం పులుమామిడి దగ్గర వాహనాల తనిఖీల సమయంలో ఈ ముఠా సభ్యులు పట్టుబడ్డారు. ఒక కారుతో పాటు రెండు యాక్టివా వాహనాలపై సోనీ కంపెనీకి చెందిన టీవీలు పెట్టుకొని తిరుగుతుండగా అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీశారు. నాసిరకం టీవీలు తీసుకొచ్చి సోనీ కంపెనీ సాఫ్ట్‌వేర్ వేసి ప్రజలకు అమ్ముతూ మోసం చేస్తున్నట్లు తేల్చారు. ఆండ్రాయిడ్ టీవీలో సోనీ కంపెనీ సాఫ్ట్‌వేర్ వేసి 10 సెకన్లలోనే సోనీ కంపెనీ టీవీగా మారుస్తున్నారు ఈ ముఠా సభ్యులు.
ఇప్పటికే గ్రామాల్లో విక్రయించిన 71 నాసిరకం టీవీలతో పాటు ఒక కారు, ఒక వ్యాన్, 7 యాక్టివా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఢిల్లీలో ఉండే పవన్ శర్మ, సలీంలు ఈ ముఠా సభ్యులను గ్రామాల్లోకి పంపించారని.. గతంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో కూడా విక్రయాలు చేశారన్నారు డీఎస్సీ.