CM Revanth Reddy: అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్.. వీడియో చూడండి..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన పెద్దమనసు చాటుకున్నారు. తాను వెళుతున్న దారిలో వస్తున్న అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉదయం 11 గంటల 45 నిమిషాల ప్రాంతంలో KBR పార్క్ రోడ్డులో ఈ దృశ్యం కనిపించింది. తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని, CMగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి ట్రాఫిక్ అధికారులకు సూచించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన పెద్దమనసు చాటుకున్నారు. తాను వెళుతున్న దారిలో వస్తున్న అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉదయం 11 గంటల 45 నిమిషాల ప్రాంతంలో KBR పార్క్ రోడ్డులో ఈ దృశ్యం కనిపించింది. తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని, CMగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి ట్రాఫిక్ అధికారులకు సూచించారు. ఇప్పటికే ట్రాఫిక్‌లో జనానికి ఇబ్బందులు లేకుండా సీఎం చొరవ తీసుకుంటున్నారు. ఈ మేరకు సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం కాన్వాయ్ పయనిస్తోంది. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తుండగా.. అంబులెన్స్ అటుగా వస్తుండటంతో ఆయన తన కాన్వాయ్ ను పక్కకు జరపమని చెప్పి అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అభయహస్తం దరఖాస్తుల అమ్మకంపై సీఎం ఆగ్రహం..
కాగా.. నెట్ సెంటర్లలో, బయట దుకాణాల్లో అభయహస్తం దరఖాస్తుల అమ్మకంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టంగా చెప్పారు. రైతుభరోసా, పెన్షన్లపై అపోహలు వద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల సమీక్షలో భరోసా ఇచ్చారు. పాత లబ్ధిదారులకు యథాతథంగా లబ్ధి చేకూరుతుందని CM రేవంత్ హామీ ఇచ్చారు. కొత్తగా లబ్ధిపొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..