Ayodhya: ప్రాణ ప్రతిష్ట వేళ 500 ఏళ్ల తర్వాత తలపాగా, చెప్పులు ధరించనున్న సూర్యవంశరాజులు.. రామయ్య దయవల్లే అంటూ…
మానవుడిగా జన్మించి తన నడవడికతో దేవుడిగా కీర్తించబడుతున్నాడు. కోట్లాది హిందువుల ఆరాధ్యదైవంగా పూజించబడుతున్నాడు. రామయ్య జన్మించిన ప్రాంతలోనే రామాలయం కూల్చివేతకు గురైతే.. కొన్ని వందల ఏళ్లుగా రాముడు నడయాడిన నెలలో రామాలయ నిర్మాణం కోసం పోరాటం చేసి.. చివరకు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకున్నాం.. దాదాపు 500 ఏళ్ల తర్వాత కొత్త ఏడాది 22.01.2024న అయోధ్యలో రాముడు జన్మించిన ప్రదేశంలోనే కుంభాభిషేకం జరగబోతోంది. ఆ రోజు మరో ముఖ్యమైన సంఘటనకు వేదిక కానుంది అయోధ్య.