AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Politics: తెలంగాణలో పొలిటికల్ రగడ.. మూడు పార్టీల మధ్య పేలుతున్న మాటల తూటాలు..

తెలంగాణలో పార్టీల మధ్య పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతుంది. అధికారపార్టీ టార్గెట్ గా బీజేపీ, కాంగ్రెస్‌లు మాటల దాడికి దిగుతున్నాయి. బీఆర్ఎస్‌కు వీఆర్ఎస్ చెప్పబోతున్నారంటూ బీజేపీ..

Telangana Politics: తెలంగాణలో పొలిటికల్ రగడ.. మూడు పార్టీల మధ్య పేలుతున్న మాటల తూటాలు..
Telangana Politics
Shaik Madar Saheb
|

Updated on: Dec 17, 2022 | 9:50 AM

Share

తెలంగాణలో పార్టీల మధ్య పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతుంది. అధికారపార్టీ టార్గెట్ గా బీజేపీ, కాంగ్రెస్‌లు మాటల దాడికి దిగుతున్నాయి. బీఆర్ఎస్‌కు వీఆర్ఎస్ చెప్పబోతున్నారంటూ బీజేపీ.. బీఆర్ఎస్ పుణ్యామాని స్వంత పార్టీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ వేదికగా కేసీఆర్ దర్శనం కలిగిందంటూ కాంగ్రెస్ విమర్శలు చేసింది. మరోవైపు నడ్డా విమర్శలపై ఆటమ్ బాంబ్ పేల్చారు మంత్రి హరీష్ రావు.. ఇలా మూడు ప్రధాన పార్టీల వార్ తో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్‌లు మాటల దాడి చేస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పై బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్‌ తరుణ్‌చుగ్‌ సెటైర్లు వేశారు. ప్రజలు కేసీఆర్‌ను వద్దనుకుంటున్నారు.. అసహ్యించుకుంటున్నారని ఆరోపించారు తరుణ్‌చుగ్‌. త్వరలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు వీఆర్‌ఎస్‌ చెప్పబోతున్నారని జోస్యం చెప్పారు.

కరీంనగర్‌ సభలో బీజీపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీఆర్ఎస్ పార్టీపై చేసిన విమర్శలకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. BJP ఇచ్చిన హామీలేన్ని? అందులో నెరవేర్చినవి ఎన్నో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడులో ఓటమి తర్వాత కూడా BJP ఇంకా జ్ఞానోదయం కాలేదనిఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివి వెళ్లారని.. BRSకు VRS అంటూ ప్రాసకోసం పాట్లు పడ్డారంటూ నడ్డా వ్యాఖ్యలను సెటైర్లు చేశారు హరీష్‌రావు.

రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి కేసీఆర్ అణిచివేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రులకు దక్కని కేసీఆర్ దర్శనం.. ఢిల్లీలో లభించిందని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు చేసిన మల్లురవి విమర్శలు చేశారు. సొంత రాష్ట్రంలో ఓడిపోయిన నడ్డా వచ్చి అబద్దాలు చెప్పి వెళ్లారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మల్లు రవి..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..