Telangana Politics: అది ఎవరితరం కాదు.. కేటీఆర్ వ్యాఖ్యలకు జగ్గా రెడ్డి కౌంటర్

తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ నేతలు తగ్గేదేలే అన్నట్టుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోనుంది.

Telangana Politics: అది ఎవరితరం కాదు.. కేటీఆర్ వ్యాఖ్యలకు జగ్గా రెడ్డి కౌంటర్
KTR JaggaReddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 27, 2024 | 9:43 AM

తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ నేతలు తగ్గేదేలే అన్నట్టుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలో తమ పాలనకు సంబంధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి టార్గెట్ చేసే విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా దూకుడుగా ముందుకు సాగుతోంది. రేవంత్ ప్రభుత్వం ఏడాదిలోనే విఫలమైందని విమర్శలు గుప్పిస్తోంది. ఈ పొలిటికల్ పంచాయితీలో నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. లగచర్ల బాధితులుగా అండగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 119 నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని హెచ్చరించారు.

రేవంత్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటిది: కేటీఆర్

రేవంత్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటిదని.. ఢిల్లీ వాళ్లకు జలుబు చేస్తే ఇక్కడ రేవంత్ పదవి పోతుందని ఎద్దేవా చేశారు కేటీఆర్. అలాంటి రేవంత్ సర్కార్‌ను చూసుకుని కొందరు కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారని విమర్శించారు.

కేటీఆర్‌కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్

అయితే కేటీఆర్‌ కామెంట్స్‌కు కాంగ్రెస్‌ నేతలు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తానంటున్న కేటీఆర్‌కు అంత శక్తి ఉందా ? అని ప్రశ్నించారు ఆ పార్టీ నేత జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ మర్రిచెట్టు లాంటిదని.. దాన్ని ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు.

రాబోయే రోజుల్లో మరింత పొలిటికల్ హీట్

మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ దీక్షా దివస్, కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలు ఉండటంతో.. రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మరింత పీక్స్‌కు చేరే అవకాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..