Telangana: అభివృద్ధి కోసం పోరుబాట పట్టిన గ్రామస్తులు.. సర్పంచ్, ఉపసర్పంచ్‌కు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న వైనం..

గ్రామాభివృద్ధి కోసం పోరుబాట పట్టారు మద్దెలచెరువు గ్రామస్తులు. సర్పంచ్‌ అండ్‌ ఉపసర్పంచ్‌కి వ్యతిరేకంగా పెద్ద యుద్ధమే చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం..

Telangana: అభివృద్ధి కోసం పోరుబాట పట్టిన గ్రామస్తులు.. సర్పంచ్, ఉపసర్పంచ్‌కు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న వైనం..
Village Development
Follow us

|

Updated on: Oct 31, 2022 | 10:54 PM

గ్రామాభివృద్ధి కోసం పోరుబాట పట్టారు మద్దెలచెరువు గ్రామస్తులు. సర్పంచ్‌ అండ్‌ ఉపసర్పంచ్‌కి వ్యతిరేకంగా పెద్ద యుద్ధమే చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెలచెరువు గ్రామంలో నిధుల గోల్‌మాల్‌పై రగడ జరిగింది. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ కలిసి.. పంచాయతీ నిధులను కాజేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు ప్రజలు. కాకి లెక్కలు రాస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారంటూ గ్రామసభలో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ను నిలదీశారు గ్రామస్తులు. ఓల్డ్‌ వాటర్‌ ట్యాంక్స్‌కి కొత్త పెయింటింగ్‌లు, గల్లీ రోడ్లకు మొరం, శానిటేషన్‌ వర్క్స్‌, ఆన్‌లైన్‌ సర్వేలు, అంటూ డబ్బు దండుకుంటున్నారని ఆరోపించారు.

ఎప్పుడో చేసిన పనులకు కూడా మళ్లీ శిలాఫలకాలు పెడుతూ నిధులు కాజేస్తున్నారని అంటున్నారు మద్దెలచెరువు గ్రామస్తులు. లెక్కలు అడిగితే మీ దిక్కున్నచోట చెప్పుకోండని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. పల్లెల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను కొట్టేశారంటున్నారు గ్రామస్తులు. వైకుంఠ ధామం, కంపోస్ట్‌ షెడ్డుల నిర్మాణంలో కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు మద్దెలచెరువు గ్రామస్తులు. ఇక గ్రామ అభివృద్ది కోసం ప్రతి నెల విధిగా గ్రామ సభ నిర్వహించాల్సిన ప్రభుత్వ అధికారి పంచాయితీ కార్యదర్శి పాలక వర్గ సభ్యుల ఇంటివద్దకే రిజిష్టర్ లను పంపి సంతకాలు చేయించుకొని తుతు మంత్రంగా పని కానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..