AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వివాదాస్పదమవుతున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వ్యాఖ్యలు.. చర్యలు తీసుకోవాలని హైందవ సంఘాల డిమాండ్

కోవిడ్ తగ్గుముఖం పట్టడానికి ఏసుక్రీస్తే కారణమంటూ తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌ డాక్టర్ జి.శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. విశ్వహిందూపరిషత్తుతో సహా పలు హైందవ సంఘాలు ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం..

Telangana: వివాదాస్పదమవుతున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వ్యాఖ్యలు.. చర్యలు తీసుకోవాలని హైందవ సంఘాల డిమాండ్
Dh Srinivas, Vhp
Amarnadh Daneti
|

Updated on: Dec 22, 2022 | 10:52 AM

Share

కోవిడ్ తగ్గుముఖం పట్టడానికి ఏసుక్రీస్తే కారణమంటూ తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌ డాక్టర్ జి.శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. విశ్వహిందూపరిషత్తుతో సహా పలు హైందవ సంఘాలు ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారిగా ఉండి.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సరికాదంటూ హైందవ సంఘాల నాయకులు అంటున్నారు. కేవలం ఏసుక్రీస్తు వల్లనే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై విశ్వహిందూపరిషత్తు తెలంగాణ శాఖ మండిపడింది. హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాస్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. కిందిస్థాయి ఉద్యోగులను ప్రభావితం చేసే విధంగా.. హిందువులను కించపరిచే స్థాయిలో మాట్లాడటం తగదంటున్నాయి హైందవ సంఘాలు. ప్రభుత్వ ఉద్యోగి అయిఉండి.. వివాదస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. ఓ మతం వారిని కించపరిచే విధంగా మాట్లాడిన శ్రీనివాస్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విశ్వహిందూపరిషత్తు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందిచకుంటే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాస్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా కేసులు తగ్గడానికి కారణం ఏసుక్రీస్తేనంటూ వ్యాఖ్యానించారు. క్రైస్తవ మతమే మానవ మనుగడకు అభివృద్ధి నేర్పిందన్నారు. భారత దేశాభివృద్ధికి క్రైస్తవమతమే కారణమన్నారు. ఏసుక్రీస్తు దయవల్లే కోవిడ్ తగ్గుముఖం పట్టిందన్నారు.

ఇటీవల కాలంలో ఆయన చేసిన పనులు వివాదస్పదమవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఏసు క్రీస్తు దయ, కృప వల్లే కరోనా కట్టడి అయ్యిందన్నారు శ్రీనివాస్. మనం మంచి చేయడం వల్ల తగ్గిందని చాలామంది అనుకుంటున్నారని, కాని వాస్తవం అది కాదన్నారు. సృష్టిలో అనేక జాతులు ఉన్నాయని, ఏ జాతికి లేని ప్రమాదం మానవ జాతికే ఎందుకు వచ్చిందన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారానికి కారణమయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..