Trains cancelled: సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో పలు రైళ్ల రద్దు.. మరికొన్ని రైళ్ల దారి మళ్లింపు..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్‌లో బిసుగిర్ షరీఫ్-పొత్కపల్లి స్టేషన్ల మధ్య ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారిమళ్లించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్‌లో బిసుగిర్ షరీఫ్-పొత్కపల్లి స్టేషన్ల మధ్య ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారిమళ్లించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే రైలు, డిసెంబర్ 24వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్, కాజీపేట-సిర్పూర్ టౌన్, బల్హర్ష-కాజీపేట, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ రైళ్లు రద్దు చేయబడ్డాయి. డిసెంబర్ 23వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య కాజీపేట- బలర్షా, బలర్షా – కాజీపేట మధ్య నడిచే రైళ్లు రద్దు చేయబడ్డాయి.
డిసెంబర్ 24వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్ మధ్య రైలు సర్వీసులు పాక్షికంగా రద్దు చేశారు. డిసెంబర్ 23, 26, 27 తేదీల్లో సికింద్రాబాద్-దానాపూర్ మధ్య నడిచే రైళ్లను దారి మళ్లించగా, డిసెంబర్ 24న నడిచే సికింద్రాబాద్-దానాపూర్ రైళ్లను రీషెడ్యూల్ చేశారు రైల్వే అధికారులు.
పై మార్గాల్లో ప్రయాణించే ప్రయాణీకులు రైలు రద్దు సమాచారాన్ని తెలుసుకోవాలని, రైల్వే శాఖకు సహకరించాలని అధికారులు కోరారు. ఇంటర్ లాకింగ్ పనులు పూర్తికాగానే రైళ్లను పునరుద్దరిస్తామని వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..