Telangana: రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు.. బీఆర్ఎస్, బీజేపీ మధ్య పేలుతున్న మాటల తూటాలు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఛార్జ్ షీట్ లో ఈ కవిత పేరు పేరు ఉండటంపై తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారమే చెలరేగుతోంది. బీఆర్ఎస్ - బీజేపీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం.

Telangana: రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు.. బీఆర్ఎస్, బీజేపీ మధ్య పేలుతున్న మాటల తూటాలు..
Brs Vs Bjp
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 22, 2022 | 8:46 AM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఛార్జ్ షీట్ లో ఈ కవిత పేరు పేరు ఉండటంపై తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారమే చెలరేగుతోంది. బీఆర్ఎస్ – బీజేపీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం. సవాళ్లు ప్రతిసవాళ్లు.. ట్వీట్లూ హీట్లూ నడుస్తున్నాయ్. ఇదంతా బీజేపీ ఆడుతోన్న ఒక పొలిటికల్ గేమ్ గా కొట్టి పారేస్తోంది బీఆర్ఎస్. ఇదే అంశంపై బీజేపీ కౌంటర్.. బీఆర్ఎస్ రివర్స్ అటాక్.. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఛార్జ్ షీట్ దర్యాప్తు చేశాక ఇచ్చే రిపోర్టు. ఇందులో ఈడీ, సీబీఐ, పోలీస్ కి తేడా లేదు. ఎవరు దర్యాప్తు చేసినా.. ఆ తర్వాత రూపొందించే వివరాల సారాంశమే ఛార్జ్ షీట్.. కాబట్టి.. ఇప్పటికే కవిత పేరు ఛార్జ్ షీట్ లో పలుమార్లు వచ్చింది కాబట్టి.. ఆమెకు ఈ కేసులో డీప్ రిలేషనుంది. వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు. లిక్కర్ పాలసీ ద్వారా కోట్లాది రూపాయలు.. చేతులు మారాయి. ఇవన్నీ తేలాకే.. కవిత పేరు ఇందులోకి వచ్చిందనీ. ఏమీ లేకుండా ఆమె పేరు ఛార్జ్ షీట్ లో ఎక్కే ప్రసక్తే లేదంటూ బీజేపీ పేర్కొంటోంది.

ఇందులో తమ పార్టీ కుట్ర లేనే లేదంటారు బీజేపీ నాయకులు. అతుల్ అరోరా ఎవరో తమకు తెలీదనీ. అతని కన్ఫెక్షన్ స్టేట్ మెంట్ లో కవిత పేరొచ్చిందనీ. విజయ్ నాయర్, మహేంద్రు, ఎంఎస్ రెడ్డి, వీరితో పాటు కవిత పేరు కూడా బయటకు వచ్చిందనీ. ఒబెరాయ్ హోటల్ కి వెళ్లారు. 91 సెల్ ఫోన్లతో పాటు లాప్ టాప్ ధ్వంసం చేశారు. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ విషయాలు. అంతే కానీ ఇదంతా బీజేపీ సృష్టి కానేకాదంటున్నారు బీజేపీ నాయకులు. ఇన్ని విషయాలు వెలుగులోకి వచ్చాక కవిత ఇన్వాల్వ్ మెంట్ ఉందనే తాము అనుకుంటున్నామనీ. కఠిన చర్యలు తప్పవనీ హెచ్చరిస్తున్నారు కమలనాథులు. కరెప్షన్ ఎక్కడున్నా ఖండించి తీరాల్సిందేననీ.. జాతీయ స్థాయిలో మీరు పార్టీ పెట్టడం మాత్రమే కాదు.. మీ కరెప్షన్ కూడా అంతే స్తాయిలో దేశమంతటా వెళ్లిందనీ ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు బీజేపీ లీడర్లు.

అవినీతి ఎక్కడ ఎలా జరిగినా సరే ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందేననీ. బీఆర్ఎస్ పాలసీ కూడా ఇదేనంటున్నారీ పార్టీ లీడర్లు. ఇది ముమ్మాటికీ బీజేపీ కుట్రేనంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. కవిత రెబల్ గా మారి పార్టీ నుంచి బయటకు రాలేదన్న అక్కసుతోనే ఆమెను ఈ కేసులో ఇరికించారని. ఆ మాటకొస్తే డబ్బులిచ్చిన వారి పేర్లున్నట్టే.. లిక్కర్ పాలసీ మేకర్లు, డబ్బు తీస్కున్న వారి పేర్లు ఎందుకులేవని నిలదీస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు.

ఇవి కూడా చదవండి

ఛార్జ్ షీట్ లో పేరుండగానే నిందితులైపోరనీ. ఇలాంటి ఎన్నో కేసులు వీగిపోయాయనీ. ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్రగా వర్ణిస్తోంది బీఆర్ఎస్.. ఇందులో కవిత ఇన్వాల్వ్ మెంట్ ఉంది కాబట్టే.. ఆమె పేరు ఇన్నిసార్లు ఛార్జ్ షీట్ లో వస్తోందనీ అంటున్నారు బీజేపీ నాయకులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!