AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బిగ్‌ ట్విస్ట్‌.. ఆ కేసులోనే రోహిత్‌ రెడ్డికి ఈడీ నోటీసులు.. నేడు విచారణకు మాణిక్‌చంద్ అభిషేక్‌..

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాండూర్‌ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డిని రెండు సార్లు విచారించిన విషయం తెలిసిందే. మళ్లీ విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది.

Telangana: బిగ్‌ ట్విస్ట్‌.. ఆ కేసులోనే రోహిత్‌ రెడ్డికి ఈడీ నోటీసులు.. నేడు విచారణకు మాణిక్‌చంద్ అభిషేక్‌..
Rohit Reddy
Shaik Madar Saheb
|

Updated on: Dec 22, 2022 | 8:44 AM

Share

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాండూర్‌ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డిని రెండు సార్లు విచారించిన విషయం తెలిసిందే. మళ్లీ విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో సెవెన్ హిల్స్ మాణిక్ చంద్ యజమానికి ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నోటీసులకు పైలట్ రోహిత్ రెడ్డికీ ఉన్న సంబంధమేంటని చూస్తే.. ఇప్పటి వరకూ ఈడీ రోహిత్ రెడ్డిని విచారించిందే ఈ కేసు విషయమై అని స్పష్టమైంది. మాణిక్‌ చంద్‌ కేసులోనే రోహిత్‌ రెడ్డిని విచారించినట్లు తెలుస్తోంది.

మాణిక్ చంద్ యజమాని గతంలో ఫామ్ హౌస్ నిందితుడు నందకుమార్ పై ఫిర్యాదు చేశారు. కారణం నందకుమార్, రోహిత్ సోదరుడు రితేష్ రెడ్డి, అభిషేక్ మధ్య రూ.7.70 కోట్ల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు ఈడీ అధికారులు. ఈ మొత్తం ఎక్కడి నుంచి ఎలా వచ్చింది? ఆ వివరాలేంటన్న కోణంలో ఈ రోజు ఉదయం పదిన్నర గంటలకు ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు అభిషేక్.

రోహిత్ ను సైతం ఇదే కేసులో విచారించినట్టు ఎలా తెలుస్తోందంటే.. రోహిత్, అభిషేక్ కి ఇచ్చిన నోటీసులు రెండూ ఒకేలా ఉండటమే ఇందుకు ఆధారం. అయితే ఇవాళ ఈడీ ముందుకు హాజరు కానున్న అభిషేక్ ఈడీ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెబుతారు? ఈ విషయాలను మీడిమా ముందు చెబుతారా? లేదా అన్న ఉత్కంఠ ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

అభిషేక్- రోహిత్ సోదరుడు- నందకుమార్ మధ్య ఈ ఏడున్నర కోట్లకు పైగా మొత్తం చేతులు మారినట్టు భావిస్తోంది ఈడీ. ఈ సమయంలో వీరి నుంచి తగిన వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. నందు, రోహిత్‌ సోదరుడు, అభిషేక్‌ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్.. రూ.7.70 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి.. లావాదేవీలు ఎలా జరిగాయన్న విషయంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల పదహారున ఈడీ నోటీసులు అందుకున్న రోహిత్ రెడ్డి సోమ మంగళవారాలు ఈడీ విచారణ ఎదుర్కున్నారు. తాజాగా నిన్న రోహిత్ కి రిలేటెడ్ గా అభిషేక్ కు నోటీసులివ్వడం. ఈ ఇద్దరికీ ఇచ్చిన నోటీసులు ఒకటే కావడంతో ఈ కేసు విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఈ నెల 27న మరోమారు ఈడీ ముందుకు హాజరవుతారు రోహిత్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..