AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: మాస్క్‌ దుమ్ము దులపండి గురూ..! కరోనా ప్రమాదం ముంచుకొస్తోంది.. బీ అలర్ట్..

మాస్క్‌ల దుమ్ము దులిపే వేళయ్యింది. డిస్టెన్స్‌ మెయింటెయిన్‌ చెయ్యాల్సిన సమయం దూసుకొస్తోంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారా లేకపోతే రెడ్‌ ఎలర్టే..

Covid-19: మాస్క్‌ దుమ్ము దులపండి గురూ..! కరోనా ప్రమాదం ముంచుకొస్తోంది.. బీ అలర్ట్..
Mask
Shaik Madar Saheb
|

Updated on: Dec 22, 2022 | 9:22 AM

Share

మాస్క్‌ల దుమ్ము దులిపే వేళయ్యింది. డిస్టెన్స్‌ మెయింటెయిన్‌ చెయ్యాల్సిన సమయం దూసుకొస్తోంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారా లేకపోతే రెడ్‌ ఎలర్టే.. మీరు బూస్టర్‌ డోస్‌ తీసుకున్నారా? లేకపోతే మొదట మీరు ఆ పని చేయండి. లేదంటే ప్రపంచవ్యాప్తంగా తరుముకొస్తోన్న కోవిడ్‌ భూతం మీవెంటపడుతుంది. ఇది మా మాట కాదు.. భారత ప్రభుత్వ హెచ్చరిక. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ మహమ్మారి మరోసారి కరాళనృత్యం చేయబోతోందన్న సంకేతాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో అప్రకటిత హై ఎలర్ట్‌ కొనసాగుతోంది.

యావత్‌ మానవాళిని హడలెత్తించిన కరోనా మరోసారి ప్రళయం సృష్టించబోతోందా? రెండున్నరేళ్ళ పాటు ప్రపంచ ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించి, సమసిపోయిందనుకున్న కోవిడ్‌ మళ్ళీ విజృంభిస్తోందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. చైనా ప్రజలను వదలకుండా పట్టి పీడిస్తోన్న కోవిడ్‌ సరికొత్త రూపం సంతరించుకుంది. అదే కొత్త వేరియంట్‌ బీఎఫ్‌-7 ఒమిక్రాన్‌ ఇప్పుడు ప్రపంచదేశాల్లోనే కాదు భారత్‌లోనూ భయోత్పాతం సృష్టిస్తోంది. ఇండియాలో మొత్తం 4 కరోనా బీఎఫ్-7 కేసులు నమోదయ్యాయి. ఒడిశాలో 2, గుజరాత్‌ లో 2 కేసులను గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ గుర్తించింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్త వేరియంట్‌ కనిపించడంతో ఎయిర్‌పోర్టుల్లో హై ఎలర్ట్‌ ప్రకటించారు.

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఏపీ వైద్యాశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో కేసుల నమోదుపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అనుమానిత కేసులను జీనొమ్ సీక్వెన్సీకి పంపతున్నారు అధికారులు. ఇక మాస్కులు ధరించాలని హెచ్చరిస్తోంది ప్రభుత్వం. ఎయిర్‌ పోర్టుల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. కోవిడ్‌ టెస్ట్‌లకూ రంగం సిద్ధం అవుతోంది.

ఇవి కూడా చదవండి

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఏపీ వైద్యాశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో కేసుల నమోదుపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అనుమానిత కేసులను జీనొమ్ సీక్వెన్సీకి పంపతున్నారు అధికారులు.

తెలంగాణ వైద్యారోగ్య శాఖ కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇకపై అన్ని పాజిటివ్ కేసుల శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపాలని నిర్ణయించుకుంది.

కరోనా న్యూ వేరియంట్ ప్రమాదంతో జాగ్రత్తగా ఉండాలని.. మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని పేర్కొంటున్నారు.

ఏంటీ కొత్త వేరియంట్‌?

బీఎఫ్‌-7 ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్నారు. దీనిపై నిపుణుల అధ్యయనం కొనసాగుతోంది. అయితే అత్యంత వేగంగా విజృంభించడం దీని ప్రథమ లక్షణంగా భావిస్తున్నారు. ఈ వేరియంట్‌ ఇన్‌క్యుబేషన్‌ పీరియడ్‌ కూడా చాలా తక్కువని గుర్తించారు. ఈ వేరియంట్‌ ఏ వ్యాక్సిన్‌ని అయినా తట్టుకొని నిలబడగల శక్తి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..