Watch Video: అంత్యక్రియలకు ఎంత గోసో.. పాడేతో గోదారి వరద దాటెళ్లి అంతిమ సంస్కారాలు!
ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతుంది. ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు గోదావరి వరద నీటితో పంటలు నీట మునిగాయి. కొన్ని గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐతే గోదావరి పరివాహక గ్రామాల్లో..

ములుగు, అక్టోబర్ 1: ములుగు జిల్లాలోని ఆ గ్రామస్తులు చనిపోయిన వ్యక్తి అంతిమ సంస్కారాలు నిర్వహించాలంటే వాళ్ళ ప్రాణాలు ఫణంగా పట్టాల్సిందే. రహదారి మొత్తం గోదావరి వరద కమ్మేయడంతో దహన సంస్కారాల కోసం వాళ్ళు పడిన పాట్లు అయ్యో పాపం అనిపించాయి. చనిపోయిన వ్యక్తి పాడెను భుజాన ఎత్తుకొని నడుము లోతు నీళ్లలో మృతుని కుటుంబ సభ్యులు పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు.
ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతుంది. ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు గోదావరి వరద నీటితో పంటలు నీట మునిగాయి. కొన్ని గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐతే గోదావరి పరివాహక గ్రామాల్లో చనిపోయిన వారి అంతిమ సంస్కారాలు అక్కడి ప్రజలకు పెద్ద సవాల్ గా మారింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు చేయడానికి మృతుని కుటుంబ సభ్యులు గ్రామస్తులు పడరని పాట్లుపడ్డారు..నడుము లోతు వరదనీటిలో పాడెను మోసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు.
వెంగళరావుపేట గ్రామానికి చెందిన వేల్పుల సమ్మయ్య (55) అనారోగ్యంతో చనిపోయారు. దీంతో అంత్యక్రియలు నిర్వహించడానికి వెళ్లే దారిలేక అయోమయంలో చిక్కుకున్నారు. వరద నీటిలో పాడే భుజాన ఎత్తుకొని తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు నానా అవస్థలు పడ్డారు.. ఊరి చిరవ వైకుంఠధామం వద్దకు వెళ్ళే దారిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది..ఈ క్రమంలో దహన సంస్కారాలు చేయడానికి మరో మార్గం లేక అష్టకష్టాలు పడుతూ నీటి ప్రవాహంలోనే మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు. వర్షాలు కురిసిన సమయంలో ఎవరైనా మృతి చెందితే, వారికి చివరి కార్యక్రమాలు నిర్వహించేందుకు నానాయాతన పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లిన ప్రయోజనం లేదని వాపోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.








