AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KR Nagaraju: రాజకీయ దుమారం రేపుతున్న వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారితీశాయి.. ఈ వ్యాఖ్యల పట్ల ఇప్పుడు హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి.

KR Nagaraju: రాజకీయ దుమారం రేపుతున్న వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
Mla Kr Nagaraju
G Peddeesh Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 01, 2024 | 7:30 PM

Share

వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారితీశాయి.. గుడి కడితే బిచ్చగాళ్లు పెరిగిపోతారు.. బడి కడితే మేధావులు పెరుగుతారని ఆయన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల ఇప్పుడు హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి.

వరంగల్ ఎంపీ కడియం కావ్య తో కలిసి సోమవారం(సెప్టెంబర్ 30) వర్ధన్నపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ముందు విద్యార్థుల ప్రోగ్రాంకు హాజరు కావాలని అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన నినాదాన్ని ఫాలో అవ్వాలని సూచించారు. బడి కడితే మేధావులు పెరిగిపోతారు.. అదే గుడి కడితే బిచ్చగాళ్లు పెరుగుతారని ఆ సమావేశంలో వ్యాఖ్యలు చేశారు..

వీడియో చూడండి..

ఆయన వ్యాఖ్యలు రాజకీయ దుమారని దారితీశాయి.. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు, బీజేపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అయితే ఏమాత్రం తగ్గేదేలే అన్న MLA కేఆర్ నాగరాజు.. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. తాను కూడా ఇంట్లో నిత్యం దేవున్ని పూజిస్తానని, అలాగని నేను దైవత్తానికి వ్యతిరేకం కాదన్నారు. బడి కట్టడం తప్పనే వాళ్ళు తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇలాంటి సున్నితమైన విషయాలను రాజకీయ వివాదం చేయడం తగదని విమర్శలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..