Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS – Congress: తగ్గేదేలే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లీగల్ వార్.. నోటీసులు ఇచ్చుకుంటున్న నేతలు..

మాటలతోనే మజా ఏముంటుంది. దానిక్కాస్త లీగల్‌ ఫైట్‌ టచప్‌ కూడా ఇస్తే సంవాదం ఇంకా బలంగా ఉంటుంది. లీగల్‌ నోటీసులతో కొత్త ట్రెండ్‌ మొదలుపెట్టింది తెలంగాణ రాజకీయం. బీఆర్‌ఎస్‌ అగ్రనేతల్లో ఒకరు లీగల్‌ నోటీస్‌ అందుకుంటే.. మరొకరు కాంగ్రెస్‌ ఎంపీకి లీగల్‌ నోటీసిచ్చారు. అంతంకాదిది ఆరంభం అన్నట్లున్నాయ్‌ తెలంగాణ గడ్డపై లీగల్‌ పాలిటిక్స్‌.

BRS - Congress: తగ్గేదేలే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లీగల్ వార్.. నోటీసులు ఇచ్చుకుంటున్న నేతలు..
Congress BRS
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 01, 2024 | 7:43 PM

తెలంగాణ పాలిటిక్స్‌లో కొత్త ట్రెండ్‌..  ఎప్పుడూ చూడని ట్రెండే.. అదేంటంటే.. ఏకవచన సంబోధనలు, వ్యక్తిగత ఆరోపణలకుదాకా వెళ్లే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ఒరవడి కనిపిస్తోంది. మాటకు మాటతో సరిపోవడం లేదు. కౌంటర్‌కి రివర్స్ కౌంటర్‌ ఇస్తే చాలడం లేదు. ఎన్ని చెప్పుకున్నా ఎంత తిట్టుకున్నా సంతృప్తి చెందడం లేదు. అంతకుమించి అన్నట్లు.. లీగల్‌ నోటీసులతో ప్రత్యర్థులు, ఆరోపణలు చేసినవాళ్లను కోర్టుకీడ్చాలనుకుంటున్నారు నేతలు. కొన్నివారాల వ్యవధిలోనే ఇద్దరి లీగల్‌ నోటీసులతో స్టేట్‌ పాలిటిక్స్‌లో ఇప్పుడు దీనిపైనే చర్చ. కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్‌కి లీగల్‌ నోటీసు ఇచ్చారు బీఆర్‌ఎస్‌కి చెందిన మాజీ మంత్రి హరీష్‌రావు. అవాస్తవ ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారని న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు హరీష్‌రావు. ఎప్పట్నించో రాజకీయాల్లో ఉన్న హరీష్‌రావుకు ఆరోపణలు, సవాళ్లు కొత్తకాకపోయినా.. ఈసారి కౌంటర్‌తో సరిపెట్టకుండా కాంగ్రెస్‌ ఎంపీకి లీగల్‌ నోటీస్‌ కూడా పంపారు. హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలతో పాటు మూసీ ప్రక్షాళన.. రాజకీయాలను షేక్‌ చేస్తోంది. ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి విపక్షపార్టీలు. బీఆర్ఎస్ నుంచి హరీష్‌రావు, కేటీఆర్‌తో పాటు ముఖ్యనేతలు బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇదే సమయంలో హరీష్‌రావుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. హిమాయత్ సాగర్ FTL పరిధిలో ఉన్న ఆనంద్ కన్వెన్షన్‌లో హరీష్‌కి వాటాలున్నాయని ఆరోపించారు ఎంపీ అనిల్ కుమార్. మూసీ పర్యటన పేరుతో రాజకీయ డ్రామాలు ఎందుకో తెలుసా.. హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన కన్వెన్షన్‌లో హరీష్...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
వెనక్కు తగ్గం.. సీబీఐ విచారణ ముందు కేటీఆర్ సంచలన ట్వీట్..
వెనక్కు తగ్గం.. సీబీఐ విచారణ ముందు కేటీఆర్ సంచలన ట్వీట్..
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
గేదెల షెడ్‌లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా..
గేదెల షెడ్‌లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా..
రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు...అంతలో వీడియో
రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు...అంతలో వీడియో
బంగారం కోసం వరుస పెళ్లిళ్లు.. చివరికి..వీడియో
బంగారం కోసం వరుస పెళ్లిళ్లు.. చివరికి..వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో