AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: విద్యార్థుల తలరాతలను మార్చిన మాస్టారు.. విద్యార్థులు ఏం చేశారో తెలుసా..!

విద్యార్థి జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. తల్లిదండ్రుల తర్వాత గురువును దైవంగా భావిస్తుంటాం. వారి ఎదుగుదలలో గురువుల పాత్ర ఎనలేనిది. విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు విద్యార్థులతో జ్ఞాన మార్గం వైపు నడిపిస్తారు.

Telangana: విద్యార్థుల తలరాతలను మార్చిన మాస్టారు.. విద్యార్థులు ఏం చేశారో తెలుసా..!
Felicitation To Retd Teacher
M Revan Reddy
| Edited By: |

Updated on: Oct 01, 2024 | 5:32 PM

Share

విద్యార్థి జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. తల్లిదండ్రుల తర్వాత గురువును దైవంగా భావిస్తుంటాం. వారి ఎదుగుదలలో గురువుల పాత్ర ఎనలేనిది. విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు విద్యార్థులతో జ్ఞాన మార్గం వైపు నడిపిస్తారు. శిక్షణతో మెరుగులద్ది ఉన్నత స్థాయికి చేర్చే మహోన్నత వ్యక్తి గురువు. అలాంటి గురువుపై విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ప్రేమను చాటుకున్నారు

యాదాద్రి జిల్లా మోత్కూరు ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడుగా మందడి రాంరెడ్డి పనిచేశారు. రాంరెడ్డి ఎక్కడ పని చేసినా విద్యార్థులతో పెనవేసుకునే బంధం ఆయన సొంతం. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, శిక్షణతో మెరుగులు అద్ది ఉన్నత స్థాయికి చేర్చారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి మైదానంలో శిక్షణ ఇచ్చేవారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మందడి రాంరెడ్డి 40 ఏళ్ళ పాటు సర్వీసులో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో పనిచేశారు. ఆయన మార్గదర్శకత్వంలో 120 మందికిపైగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు సాధించారు. ఒక్క యాదాద్రి జిల్లా మోత్కూరు మండలంలోని దత్తప్పగూడెంలోనే 40 మందికిపైగా సర్కారు కొలువులు కైవసం చేసుకున్నారు. పలువురు పోలీస్‌ శాఖలో డీఎస్పీ, సీఐ, ఎస్సై, పోలీస్‌ కానిస్టేబుల్స్‌గా, వ్యాయామ ఉపాధ్యాయులుగా, మున్సిపల్‌ కమిషనర్, రైల్వే శాఖ, ప్రజాప్రతినిధులు, ఇలా వివిధ హోదాలో ఎందరో స్థిరపడ్డారు.

ఉపాధ్యాయుడిని పల్లకిలో మోసుకొచ్చిన విద్యార్థులు..

ఉద్యోగం చేసిన వారు ఏదో ఒక రోజు పదవి విరమణ చేయాల్సిందే..! వ్యాయామ ఉపాధ్యాయుడుగా మందడి రాంరెడ్డి ఉద్యోగ విరమణ చేశారు. తమ ఉన్నతికి పాటుపడిన ఉపాధ్యాయుడు రాంరెడ్డిని విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. పూలతో అలంకరించిన పల్లకిలో వ్యాయామ ఉపాధ్యాయుడుగా మందడి రాంరెడ్డినr వేదిక వద్దకు మోసుకువచ్చారు. పూర్వ విద్యార్థులు పూలు చల్లుతూ రాంరెడ్డి దంపతులను పూలమాలలు, శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందజేసిన పూర్వ విద్యార్థులు తమ అనుబంధాన్ని పంచుకున్నారు. సమాజంలో తమకంటూ ఒక స్థానం కల్పించిన గురువుగా ఆయన చరిత్రలో నిలిచి పోతారని పూర్వ విద్యార్థులు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తనపై చూపిన అభిమానాన్ని , ఉద్వేగ క్షణాలను చూసి పదవీ విరమణ పొందుతున్న రాంరెడ్డి సైతం కన్నీళ్ళు పెట్టుకున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..