Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anurag Thakur: 2023లో తెలంగాణలో బీజేపీదే అధికారం.. మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. తెలంగాణలో శాంతి భద్రతలు క్షిణించాయని, ఇది సీఎం కెసిఆర్ కు సిగ్గు చేటుగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గూండాలు రాజ్యమేలుతున్నారంటూ ద్వజమెత్తారు.

Anurag Thakur: 2023లో తెలంగాణలో బీజేపీదే అధికారం.. మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలు
Minister Anurag Thakur(File Photo)
Follow us
Janardhan Veluru

|

Updated on: Jul 02, 2022 | 3:48 PM

2023లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వంద శాతం అదికారంలోకి వస్తుందని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనుకూల వాతావరణం ఉందన్నారు. ముందు ముందు ఇది మరింత మెరుగవుతుందన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన.. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ షందర్భంగా తెలంగాణలో శాంతి భద్రతలు దిగజారాయని విమర్శించారు.  ఇది సీఎం కెసిఆర్ కు సిగ్గు చేటుగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గూండాలు రాజ్యమేలుతున్నారంటూ ద్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువయ్యిందని ధ్వజమెత్తారు. మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగాయన్నారు. సంపన్న రాష్టం ఎందుకు అప్పుల పాలయిందని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానాలోని డబ్బులు ఎక్కడకు వెళ్లాయో టీఆర్ఎస్ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ అప్పులపై ధ్వజమెత్తిన అనురాగ్ ఠాకూర్.. అదే సమయంలో ఏపీ అప్పులపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నపై స్పందించేందుకు నిరాకరించారు. ఏపీలో అధికార వైసీపీతో బీజేపీ సంబంధాలపై అడిగిన ప్రశ్నను కూడా ఆయన దాటవేశారు.

బీజేపీని విమర్శిస్తున్న టీఆర్ఎస్ నేతలు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో తమ పాత్ర ఏంటో తెలుసుకోవాలన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును యూపీఏ సర్కారు మిస్ మ్యానేజ్ చేసినా.. బీజేపీ సహకరించిందన్నారు. కేసీఆర్ నేషనల్ పార్టీ యోచన.. గతంలో చంద్రబాబు జాతీయ రాజకీయాల చేసినట్లు ఉంటుందంటూ అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి

తాము ఫాంహౌస్ లో ఉండే నేతలం కాదని.. జనాల గుండెల్లో ఉండే వ్యక్తులమన్నారు. సామాన్యులకు పార్టీని మరింత చేరువ చేస్తామన్నారు. అందుకే ప్రతి కార్యకర్త ఇంటికి చేరే విధంగా ఒక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని అన్నారు.