Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi: శ్రీ శోభకృత్ రాష్ట్రప్రజలకు సకల శుభాలను కలుగజేయాలంటూ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కే చంద్రశేఖర్‌రావు ‘శ్రీ శోభకృత్‌’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలను చెప్పారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టంచేశారు.

Ugadi: శ్రీ శోభకృత్ రాష్ట్రప్రజలకు సకల శుభాలను కలుగజేయాలంటూ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు
Ugadi Greetings
Follow us
Surya Kala

|

Updated on: Mar 22, 2023 | 8:05 AM

తెలుగువారు జరుపుకునే మొదటి పండగల్లో ఒకటి ఉగాది ఒకటి. తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మొదటి రోజున జరుపుకునే పండగ ఉగాది. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కే చంద్రశేఖర్‌రావు ‘శ్రీ శోభకృత్‌’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలను చెప్పారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టంచేశారు. ఉగాది పండగ అన్నదాతలకు, అన్ని రంగాల్లోని వారికీ, రాష్ట్ర ప్రజలకు శుభాలను కలుగజేయాలని కేసీఆర్ కోరుకున్నారు. శ్రీ శోభకృత్‌ సంవత్సరాన్ని వ్యవసాయ సంవత్సరంగా రైతులకు సకల శుభాలను చేకూర్చాలని సూచించారు.

వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠమైనదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో తాగునీరు, సాగు నీరు, పచ్చని పంటలతో నిత్య వసంతం నెలకొన్నదని పేర్కొన్నారు. ‘శోభకృత్‌’ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని సీఎం కేసీఆర్‌ కోరుకున్నారు

ఇవి కూడా చదవండి

గవర్నర్ తమిళిసై

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది, తెలుగు నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా, తెలంగాణ ప్రజలకు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు తన  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఉగాది ఆనందం , ఆశల పండుగ అని, కొత్త సంవత్సరం కొత్త ఉల్లాసాన్ని , ఉజ్వల భవిష్యత్తును తీసుకువస్తుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

“శ్రీ శోభకృతు నామ సంవత్సరం సమాజంలోని ప్రజలందరికి.. అన్ని వర్గాలకు శాంతి, శ్రేయస్సు, సామరస్యం, ఆరోగ్యం,  సంతోషాన్ని కలిగిస్తుందని తాను విశ్వసిస్తున్నాను” అని ఆమె తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..