పాఠశాలకు వెళ్లి ఇంటికి రాలేదు.. చెరువు గట్టుపై స్కూల్ బ్యాగ్స్.. ఇంతకీ వాళ్లు ఎక్కడికి వెళ్లారు..?

పాఠశాలకు వెళ్లి ఇంటికి రాలేదు.. చెరువు గట్టుపై స్కూల్ బ్యాగ్స్.. ఇంతకీ వాళ్లు ఎక్కడికి వెళ్లారు..?
Missing

హైదరాబాద్ (Hyderabad)​లో ఇద్దరు బాలికలు మిస్సింగ్ (school girls missing) అవడం కలకలం రేపుతోంది. శనివారం ఉదయం స్కూల్ కు కు వెళ్లిన ఇద్దరు బాలికలు.. తిరిగి ఇంటికి వెళ్లలేదు. ఈ ఘటనలో వారి కుటుంబ సభ్యులు...

Ganesh Mudavath

|

Mar 06, 2022 | 9:52 PM

హైదరాబాద్ (Hyderabad)​లో ఇద్దరు బాలికలు మిస్సింగ్ (school girls missing) అవడం కలకలం రేపుతోంది. శనివారం ఉదయం స్కూల్ కు కు వెళ్లిన ఇద్దరు బాలికలు.. తిరిగి ఇంటికి వెళ్లలేదు. ఈ ఘటనలో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్​లోని జీడిమెట్ల పరిధిలోని సూరారం కాలనీకి చెందిన మౌనిక, గాయత్రిలు స్థానికంగా ఉండే స్కూల్ లో పదో తరగతి​చదువుతున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి పాఠశాలకు వెళ్లి, తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో వారిద్దరి స్కూల్ బ్యాగ్స్ సమీపంలో ని సూరారం చెరువుగట్టుపై లభించాయి.ఈ విషయంపై బాలికల తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కాగా ఇటీవల కాలంలో హైదరాబాద్​లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల రేష్మా, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని చిన్నకోడూరుకి చెందిన 17 ఏళ్ల శ్రావణి ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజ్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. ఏడాదిగా దూరంగా ఉంటున్న ఈ ఇద్దరూ అప్పుడప్పుడూ కలుసుకుంటున్నారు. అయితే ఆరోగ్యం బాగోలేదని చెప్పి కాలేజ్ నుంచి వచ్చేసిన శ్రావణి… హాస్టల్‌ నుంచి బయటికి వచ్చి చౌటుప్పల్ వెళ్లింది. ఆ తర్వాత నల్గొండలో ఉంటున్న రేష్మా కూడా ఇంట్లో సూసైడ్ నోట్ రాసిపెట్టి బయటికి వెళ్లింది. ఇద్దరూ కలిసి పానగల్ ఉదయ సముద్రం జలాశయానికి చేరుకున్నారు. ఉదయసముద్రం దగ్గర రెండు చున్నీలు, ఓ బ్యాటు పెట్టి వెళ్లారు. రేష్మా ఓ సూసైడ్ నోట్ రాసి బ్యాగులో పెట్టింది. వారిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Also Read

Russia Ukraine Crisis: ట్రంపా మాజాకా.. అధికారం లేకున్నా అదును చూసి ఏసేస్తున్నాడు.. ఏం స్ట్రాటజీ సామీ..!

Health Tips: అన్నం తింటూ మధ్యలో నీళ్లు తాగడం మంచిది కాదా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Yogananda: భారతదేశపు అతి గొప్ప యోగుల మహాసమాధి.. ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న నిర్వాహకులు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu