AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine Crisis: ట్రంపా మాజాకా.. అధికారం లేకున్నా అదును చూసి ఏసేస్తున్నాడు.. ఏం స్ట్రాటజీ సామీ..!

Russia Ukraine Crisis: ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత మనం వింటుంటాం. కానీ, అమెరికా ఎక్స్‌ ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్ ఒకే దెబ్బకు..

Russia Ukraine Crisis: ట్రంపా మాజాకా.. అధికారం లేకున్నా అదును చూసి ఏసేస్తున్నాడు.. ఏం స్ట్రాటజీ సామీ..!
Trump
Shiva Prajapati
|

Updated on: Mar 06, 2022 | 9:40 PM

Share

Russia Ukraine Crisis: ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత మనం వింటుంటాం. కానీ, అమెరికా ఎక్స్‌ ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్ ఒకే దెబ్బకు మూడు పిట్టలు కొట్టారు. ఏంటీ, అర్థం కాలేదా? అయితే, ఈ స్టోరీ చూడండి. తన వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో నిత్యం వార్తల్లో ఉంటారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. రష్యా- ఉక్రెయిన్​యుద్ధం నేపథ్యంలో, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్​ను, పుతిన్​డ్రమ్ములాగా వాయిస్తున్నారని ఇటీవలే కామెంట్లు చేశారు ట్రంప్. తాజాగా ఇలాంటి కామెంట్సే మళ్లీ చేశారాయన. అమెరికా విమానాలు, చైనా జెండాలు పెట్టుకుని రష్యాపై దాడి చేయాలని సలహా ఇచ్చారు మాజీ ప్రెసిడెంట్. అమెరికా తన ఎఫ్​- 22 ఫైటర్​జెట్లపై చైనా జెండాలు పెట్టుకుని రష్యాకు వెళ్లాలని, అక్కడ బాంబుల మోత మోగించాలని, రష్యాకు చుక్కలు చూపించాలని సూచించారు ట్రంప్. ఆ తర్వాత చైనా మీద తోసేయవచ్చని కామెంట్‌ చేశారాయన. అప్పుడు చైనా-రష్యాలు కొట్టుకుంటాయని, మనం అందరం ఆ గొడవను చూసి ఎంజాయ్​చేయవచ్చు అని అన్నారు మాజీ అధ్యక్షుడు.

అయితే, ట్రంప్​ఏ ఉద్దేశంతో ఇలా అన్నారో తెలియదు కానీ, ఆ మాటలు విన్న వారు వెంటనే నవ్వడం మొదలుపెట్టారు. చప్పట్లు కొట్టి ట్రంప్‌ను పొగిడారు. నాటో అనేది కాగితంపైనే పులి అని, బయట కాదని విమర్శించారు ట్రంప్. అణ్వాయుధలు ఉన్నంత మాత్రాన, రష్యాపై దాడి చేయరా? అని బైడెన్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. మానవాళిపై జరుగుతున్న నేరాన్ని ఇంకెంత కాలం భరిస్తారు? ఇలా జరగనివ్వకూడదు అని ఎప్పుడు అంటారు? ప్రపంచ దేశాలు ఎప్పుడు చర్యలు తీసుకుంటాయి? అని ప్రశ్నల వర్షం కురిపించారు ట్రంప్. ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం, పుతిన్​ను ప్రశంసిస్తున్నట్టుగా కామెంట్స్‌ చేశారు ట్రంప్. ఈ విషయంలో రిపబ్లికన్ పార్టీకి సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. యుద్ధం మొదలుపెట్టిన వ్యక్తిని పొగడటం ఏంటి? అని అనేక మంది సీరియస్‌ అయ్యారు. ఈ క్రమంలోనే ట్రంప్ తన వైఖరిని మార్చినట్టు తెలుస్తోంది. అయితే, ఒక్క స్పీచ్‌లోనే అటు అమెరికా ప్రెసిడెంట్‌ను, ఇటు రష్యాను, చైనాను టార్గెట్‌ చేశారు డొనాల్డ్‌ ట్రంప్. ఇలా ఒక్కదెబ్బకు మూడు పిట్టలను కొట్టాడన్నమాట.

Also Read:

Project Engineer Jobs 2022: బీటెక్‌ చేసి ఖాళీగా ఉన్నారా? మెరిట్‌ ఆధారంగా బెల్‌లో 55 వేల జీతంతో ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు..

మానవత్వం మరిచిన మామ.. కోడలిపై కన్నేసి దారుణం.. ఆఖరుకు

ఈ రైలు ప్రపంచంలోనే ప్రత్యేకం.. దానంతట అదే నడుస్తుంది.. కారణం ఏంటో తెలుసా..!