Telangana CM KCR: కేసీఆర్ మదిలో ఆ ఆలోచన ఉందా?.. విపక్షాల ఉరుకులు పరుగులు అందుకోసమేనా?..

Telangana CM KCR: కేసీఆర్ మదిలో ఆ ఆలోచన ఉందా?.. విపక్షాల ఉరుకులు పరుగులు అందుకోసమేనా?..
Kcr

Telangana: తెలంగాణలో ముందస్తుకి ముహూర్తం కుదిరిందా? ప్రతిపక్షాలన్నీ ఒక్కసారిగా ఎందుకు ఉలిక్కిపడుతున్నాయి.?

Shiva Prajapati

|

Mar 07, 2022 | 6:20 AM

Telangana: తెలంగాణలో ముందస్తుకి ముహూర్తం కుదిరిందా? ప్రతిపక్షాలన్నీ ఒక్కసారిగా ఎందుకు ఉలిక్కిపడుతున్నాయి.? ప్రభుత్వం ఆలోచన ఏంటి? విపక్షాల ప్లానింగ్ ఏంటి? అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఓసారి లుక్కేద్దాం..

తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. వరుసపెట్టి నేతలంతా ముందస్తు గురించే మాట్లాడుతున్నారు. ఈ మధ్య కేంద్రంపై యుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్.. ప్రత్యామ్నాయ కూటమికి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారాయన. మరికొందరు నేతలతోనూ టచ్‌లో ఉన్నారు. ఇటు రాష్ట్ర రాజకీయాలపైనా ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఈ మధ్యే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ కూడా సీఎంను కలవడం హాట్‌టాఫిక్‌గా మారింది. ఇదే టైమ్‌లో అలంపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహం.. కేసీఆర్ ముందస్తుకు వెళ్లే ఛాన్స్‌ ఉందంటూ చేసిన కామెంట్స్‌ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. దీంతో ఇప్పుడు విపక్షాలు కూడా ముందుస్తు స్వరం వినిపిస్తున్నాయి.

తాజాగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ డిసెంబర్‌లో అసెంబ్లీ రద్దుచేస్తారని.. మార్చ్‌లో ఎలక్షన్లు వస్తాయని అన్నారు. అటు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణలో ముందస్తు ఖాయమంటున్నారు. కర్ణాటకతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని.. అందుకే కాంగ్రెస్ నేతలంతా హైదరాబాద్ వదిలేసి.. నియోజక వర్గాలకు వెళ్లాలంటూ పిలుపునిచ్చారు.

జరుగకపోవచ్చు.. అయితే సీఎల్పీ నేత భట్టివిక్రమార్క మాత్రం ముందస్తుపై కాస్త భిన్నంగా స్పందించారు.. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్నారని, ఈ టైమ్‌లో అధికారాన్ని ముందుగానే వదులుకోకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అటు మరో సీనియర్ నేత జీవన్‌రెడ్డి కూడా ఇదే తరహా కామెంట్స్ చేశారు.

కాగా, బీజేపీ కూడా దూకుడు పెంచింది. తొలిసారి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సదస్సు ఏర్పాటు చేసింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమన్న బండి సంజయ్.. హైదరాబాద్ లోక్‌సభ సీటును గెల్చుకోవడం ద్వారా సమరశంఖం పూరిస్తామని ప్రకటించారు. మొత్తానికి ముందస్తు ఊహాగానాలతో రాష్ట్రంలో హైవోల్టేజ్ రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే, కేసీఆర్ మరోసారి 2018 వ్యూహాన్నే అమలు చేస్తారన్న ప్రతిపక్షాల జోస్యంలో నిజమెంత అన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read:

Eyesight: చిన్న వయసులోనే కళ్లు దెబ్బతినడానికి కారణం ఏంటో తెలుసా..!

పాఠశాలకు వెళ్లి ఇంటికి రాలేదు.. చెరువు గట్టుపై స్కూల్ బ్యాగ్స్.. ఇంతకీ వాళ్లు ఎక్కడికి వెళ్లారు..?

పొలం పనులు చేస్తుండగా చేతికి తాకిన వస్తువు.. ఓపెన్ చేస్తే ఫ్యూజులు ఔట్..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu