Women’s Day-TSRTC: మహిళలకు బంపర్ ఆఫర్లు ఇచ్చిన టీఎస్ఆర్టీసీ.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా..

Women's Day-TSRTC: మహిళలకు బంపర్ ఆఫర్లు ఇచ్చిన టీఎస్ఆర్టీసీ.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా..
Tsrtc Offers

Women's Day-TSRTC: అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా టీఎస్ఆర్టీసీ మ‌హిళ‌ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది.

Shiva Prajapati

| Edited By: Anil kumar poka

Mar 07, 2022 | 1:14 PM

Women’s Day-TSRTC: అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా టీఎస్ఆర్టీసీ మ‌హిళ‌ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో మ‌హిళ‌ల కోసం పీక్ అవ‌ర్స్‌లో నాలుగు ప్రత్యేక ట్రిప్పుల‌ను న‌డ‌ప‌నుంది. ఆ ప్రత్యేక బ‌స్సుల్లో 60 ఏళ్లు పైబ‌డిన మ‌హిళ‌లు మార్చి 8న సంబంధిత ఐడీని చూపించి.. ఉచితంగా ప్రయాణం చేయవ‌చ్చు.

ఉచిత డ్రైవింగ్ శిక్షణ.. అలాగే, రాష్ట్రంలోని అన్ని బ‌స్ స్టేష‌న్లలో.. మహిళా పారిశ్రామికవేత్తలు, ఎన్‌హెచ్‌జీ లేదా డ్వాక్రా గ్రూప్‌ల ద్వారా ఉత్పత్తులు సేల్స్ కోసం ఉచిత స్టాల్స్, స్పేసెస్‌ను మార్చి 31వ తేదీ వరకు ఉచితంగా అందించాలని సంస్థ నిర్ణయించింది. మహిళలకు ఉచిత హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణను కూడా సంస్థ క‌ల్పించ‌నుంది. టీఎస్ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా 30 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఆసక్తి గల మహిళలకు 30 రోజుల పాటు ఉచిత హెవీ మోటర్ వెహికిల్ శిక్షణ అందించాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆసక్తి గల మహిళలు 31 మార్చి 2022లోపు తమ పేర్లను దగ్గర్లోని డిపోలో నమోదు చేసుకోవచ్చు. శిక్షణ పొందిన మహిళలకు జిల్లా కేంద్రంలోని సంబంధిత శిక్షణ కేంద్రాలలో సర్టిఫికెట్లు కూడా అంద‌జేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు తప్పనిసరిగా ఎల్ఎంవీ లైసెన్స్ కనీస 2 సంవత్సరాలు కలిగి ఉండాలి, కోర్సులో చేరడానికి ముందు ఆర్టీఏ నుంచి ల‌ర్నర్ లైసెన్స్ పొంది ఉండాలి.

మార్చి 8 నుంచి 14 వరకు టీ24 టికెట్‌ ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రయాణంపై 20 శాతం తగ్గింపు, వరంగల్‌లోనూ ఈ ప్రత్యేక రాయితీ వర్తించనుంది. గర్భిణీ, పాలిచ్చే తల్లుల కోసం అన్ని ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులలో రెండు సీట్లు ప్రత్యేకంగా రిజర్వ్ చేస్తారు. పల్లె వెలుగు బస్సుల్లో సీటు నంబర్లు 4, 5, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సీట్ నంబర్లు 1, 2 ను వాళ్ల కోసం కేటాయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లలో డ్రైవర్‌కు వెనుక వైపు రెండు సీట్లు కేటాయించారు. ఈ సీట్లన్నీ పర్పుల్ కలర్‌లో ఉంటాయి. మహిళల కోసం కేటాయించిన సీట్లలో మహిళలు మాత్రమే కూర్చునేలా సంస్థ ప్రచారం నిర్వహించ‌నుంది.

అన్ని బస్ స్టేషన్లు, ట్రాఫిక్ రద్దీ పాయింట్ల వద్ద పర్పుల్ కలర్ బాక్స్‌లు ఉంటాయ‌ని, మహిళా ప్రయాణికులు మార్చి 31వ తేదీ వరకు ఈ బాక్స్‌లలో టికెట్ల వెనుక‌ తమ పేరు, ఫోన్ నంబర్‌ను సరిగ్గా రాసి వాటిని ఆ బాక్సుల‌లో డ్రాప్ చేయాలని సంస్థ కోరింది. అన్ని బస్ స్టేషన్లలో 2022 ఏప్రిల్ 2వ తేదీన లక్కీ డ్రా నిర్వహించి.. డ్రాలో గెలుపొందిన విజేతలకు సంబంధిత డిపో నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించడానికి నెలవారీ సీజన్ టికెట్‌తో పాటు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను సంస్థ అందించ‌నుంది. మహిళా ప్రయాణికుల ఫిర్యాదుల కోసం.. ముఖ్యంగా భద్రతకు సంబంధించిన సమస్యలకు మహిళా దినోత్సవం రోజు నుంచి ప్రత్యేక మొబైల్ నంబర్ 9440970000 ను సంస్థ అందుబాటులోకి తెచ్చింది.

Also read:

Cross fire with Bandi Sanjay: నెక్ట్స్ పవర్ మాదే.. ‘టీవీ9 క్రాస్ ఫైర్‌’లో సంచలన కామెంట్స్ చేసిన బండి సంజయ్..

Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ వార్‌‌లో కీలక మలుపు.. రంగంలోకి నాటో దళాలు.. 

అమ్మాయిలకు గమనిక.. వేసవిలో అందంగా కనిపించాలంటే ఈ తప్పులు చేయకండి..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu