మంత్రి కేటీఆర్ ఔదార్యం.. ట్విట్టర్ అభ్యర్థనపై స్పందన.. మెరిట్ విద్యార్థినులకు ఆపన్న హస్తం

మంత్రి కేటీఆర్ ఔదార్యం.. ట్విట్టర్ అభ్యర్థనపై స్పందన.. మెరిట్ విద్యార్థినులకు ఆపన్న హస్తం
Minister Ktr

తెలంగాణ మంత్రి కేటీఆర్(Minister KTR) మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఇద్దరు యువతులకు అండగా నిలిచారు. ఇంటర్‌లో 95శాతం, 97 శాతం మార్కులతో...

Ganesh Mudavath

|

Mar 07, 2022 | 6:55 AM

తెలంగాణ మంత్రి కేటీఆర్(Minister KTR) మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఇద్దరు యువతులకు అండగా నిలిచారు. ఇంటర్‌లో 95శాతం, 97 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన ఇద్దరు విద్యార్థినులు ఉచితంగా ఎంబీబీఎస్, బీటెక్ సీట్లు పొందినా.. ఫీజులు కట్టలేని పేదరికాన్ని ఎదుర్కొంటున్నారు. వారి ఉన్నత విద్య పూర్తయ్యేంతవరకు సహాయం అందిస్తామన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి(Bhupalapalli) జిల్లాకు చెందిన అక్కా చెల్లెళ్లు కావేరి, శ్రావణిలకు ఈ మేరకు మంత్రి హామీ ఇచ్చారు. ఉన్నత విద్య పూర్తయ్యేంత వరకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థిని కావేరి.. సిద్దిపేట(Siddipeta) లోని ఓ కళాశాలలో చదువుతున్నారు. ఆమె సోదరి శ్రావణి కూడా మోడల్‌ స్కూల్‌లో చదివారు. ఈ క్రమంలో ఆమె.. ఏపీలోని తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీలో సీటు సాధించింది. ఇద్దరూ మెరిట్‌ కోటాలోనే ఉన్నత విద్యా కోర్సుల్లో సీటు సాధించారు. బీఏ గ్రాడ్యుయేట్‌ అయిన వీరి తండ్రి రాజమల్లు గతంలో ప్రైవేటు పాఠశాలలో పనిచేశారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి రోజూవారీ కూలీగా పని చేస్తున్నారు.

ఈ క్రమంలో తమ ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయని ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్ కు విన్నపించుకున్నారు. వీరి పరిస్థితి కేటీఆర్‌కు చేరగా.. ఆదివారం రాజమల్లు తన కూతుళ్లతో కలిసి కేటీఆర్‌ను కలిశారు. మంత్రి కేటీఆర్.. ఆ ఇద్దరు మెరిట్ స్టూడెంట్లతో కలిసి మాట్లాడారు. వారి ఆరోగ్య వివరాలు, అవసరాల గురించి ఆరా తీసి మాట్లాడారు. వారి భవిష్యత్‌ చదువులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తమకు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చినందుకు, తమ చదువులు పూర్తి చేయడానికి సహకరిస్తున్నందుకు వారిద్దరూ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read

UP Assembly Election 2022 Voting Phase 7 Live: యూపీలో ఏడవ దశకు 9 జిల్లాల్లోని 54 స్థానాలకు పోలింగ్

అమ్మాయిలకు గమనిక.. వేసవిలో అందంగా కనిపించాలంటే ఈ తప్పులు చేయకండి..!

Shane warne: స్పిన్‌ దిగ్గజం గదిలో రక్తపు మరకలు.. థాయ్‌ పోలీసులు ఏం చెబుతున్నారంటే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu