ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మార్చి 10న రానున్నాయి. ఫలితాలకు ముందు, TV9 Telugu / Polstrat ఈరోజు సాయంత్రం 6:30 నుండి ఎగ్జిట్ పోల్‌లను మీకు అందిస్తోంది. దీనిలో మీరు ఏ రాష్ట్రంలో ఫలితాలు ఎలా వస్తాయనే దాని గురించి తెలుసుకోవచ్చు.
యూపీ అసెంబ్లీకి చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గం. వరకు 35.51 శాతం ఓటింగ్ నమోదయ్యింది.
35.51% voters turnout recorded till 1 pm in the seventh and final phase of #UttarPradeshElections2022 pic.twitter.com/u0CWtPzvPj
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 7, 2022
యూపీలోని 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు చివరి విడతలో ఇవాళ పోలింగ్ కొనసాగుతుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యంవహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజవర్గ పరిథిలోని అసెంబ్లీ స్థానాల్లోనూ ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది. చివరి విడతలో ఉదయం 11 గం.ల వరకు 18.72 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. చందువాలి నియోజకవర్గంలో అత్యధికంగా 23.5 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
యూపీలో చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అజంగఢ్‌లో వృద్ధ దంపతులు తోపుడు బండిపై పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాము అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వారు తెలిపారు. ఓటు వేసినందుకు ఎవరి నుంచీ తాము ఏమీ ఆశించడం లేదని.. రూ.500, రూ.1000లతో తమ వ్యాధి నయం కాదు కదా అన్నారు.
The elderly couple after casting their vote said, "We don't want to waste our votes, that's why came on a cart." pic.twitter.com/nLnvL1aBNb
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 7, 2022
కేంద్ర మంత్రి, ఆప్నా దళ్ (ఎస్) జాతీయ అధ్యక్షురాలు అనుప్రియ పటేల్ మిర్జాపూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
#UttarPradeshElections2022 | Union minister and Apna Dal (Sonelal), National President, Anupriya Patel casts her vote in Mirzapur pic.twitter.com/HTTWZ3nugr
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 7, 2022
యూపీ చివరి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన సమాచారం ప్రకారం ఉదయం 9 గంటల వరకు 8.58 శాతం పోలింగ్ జరిగింది. అత్యధికంగా మౌలో 9.99 శాతం, వారణాసిలో 8.93 శాతం ఓటింగ్ నమోదైంది. భదోహిలో అత్యల్పంగా 7.43 శాతం ఓటింగ్ జరిగింది.
8.58% voter turnout recorded till 9 am in last phase of #UttarPradeshElections2022
Polling is underway in 54 Assembly seats across 9 districts pic.twitter.com/FCuZNX8TAW
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 7, 2022
ఉత్తరప్రదేశ్‌లో పోలింగ్ జరుగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే రత్నాకర్ మిశ్రా మీర్జాపూర్ కుటుంబసమేతంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉత్తరప్రదేశ్ మంత్రి రవీంద్ర జైస్వాల్ కుటుంబ సమేతంగా ఓటు వేశారు. "యూపీ ప్రజలు మోడీ, యోగి పనులకు ముగ్ధులై రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో పోరాడుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ కొంపముంచుతుందని" అని ఆయన అన్నారు.
Ravindra Jaiswal
UP చివరి దశలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటేసేందుకు ప్రజలు పోలింగ్ స్టేషన్ వెలుపల తమ వంతు కోసం వేచి ఉన్నారు.
Voting
ఏడవ దశలో దక్షిణ వారణాసి ప్రాంతంలోని నేషనల్ ఇంటర్ కాలేజీలో ఓటింగ్ జరుగుతోంది. వృద్ధులు, మహిళలు పోలింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
Voting underway at National Inter College in South Varanasi area in the seventh phase of #UttarPradeshElections2022 pic.twitter.com/i8j1mgQKI0
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 7, 2022
యూపీ చివరి దశ ఎన్నికల కోసం 54 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం నుంచే ఓటేసేందుకు ఓటర్లు బారులు తీరారు.
Polling underway in Mau in the last phase of #UttarPradeshElections2022
613 candidates across 54 Assembly seats in 9 districts are in fray pic.twitter.com/j9KlhVA6Ts
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 7, 2022
వారణాసి నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న యూపీ మంత్రి రవీంద్ర జైస్వాల్ వారణాసిలోని అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 350 సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. వారణాసిలో పోలింగ్ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.
#UttarPradeshElections2022 | UP minister Ravindra Jaiswal contesting from Varanasi North Assembly constituency says we will win all seats in Varanasi.
BJP will get over 350 seats in this Assembly elections, he adds. pic.twitter.com/XR3JU4DOVh
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 7, 2022
యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు ఓటు వేయాలని పిలుపునిస్తూ.. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు-2022కి ఈరోజు చివరి దశ అని అన్నారు. ఓటర్లందరూ జాతీయవాదం, అభివృద్ధి, సుపరిపాలన విజయానికి ఓటు వేయాలన్నారు. ముందుగా ఓటు వేయండి, ఆ తర్వాత ఫలహారాలు తీసుకోండి అంటూ ట్వీట్ చేశారు.
उत्तर प्रदेश विधान सभा चुनाव-2022 का आज अंतिम चरण है।
सभी सम्मानित मतदाता गण राष्ट्रवाद, विकास और सुशासन की विजय के लिए मतदान अवश्य करें।
आपका एक वोट माफियावादियों, दंगावादियों और घोर परिवारवादियों से आपके प्रदेश को बचाएगा।
अतः पहले मतदान करें फिर जलपान करें।
— Yogi Adityanath (@myogiadityanath) March 7, 2022
ఏడో దశలో యోగి ప్రభుత్వంలోని ఏడుగురు మంత్రుల ఇవాళ జరిగే ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. వీరిలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి అనిల్ రాజ్‌భర్, రిజిస్ట్రేషన్ శాఖ సహాయ మంత్రి రవీంద్ర జైస్వాల్, సాంస్కృతిక శాఖ మంత్రి నీలకాంత్ తివారీ, పట్టణ ప్రణాళికా శాఖ మంత్రి గిరీష్ యాదవ్, విద్యుత్ శాఖ సహాయ మంత్రి రామశంకర్ సింగ్ పటేల్, సహకార శాఖ సహాయ మంత్రి సంగీతా బల్వంత్, రాష్ట్ర మంత్రి సంజీవ్ గోండ్ ఉన్నారు.
ఈరోజు ఉత్తరప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం గొప్ప త్యాగం పూర్తయిన రోజు అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఓటర్లందరూ పూర్తి ఉత్సాహంతో ఏడో, చివరి దశ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొని ఓటింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాలని అభ్యర్థిస్తున్నాను.
उत्तर प्रदेश में आज लोकतंत्र के महायज्ञ की पूर्णाहुति का दिन है। सभी मतदाताओं से मेरा आग्रह है कि वे विधानसभा चुनाव के सातवें और आखिरी चरण के मतदान में पूरे जोश-खरोश से भाग लें और वोटिंग का नया रिकॉर्ड बनाएं।
— Narendra Modi (@narendramodi) March 7, 2022
ఈరోజు ఓటింగ్ జరగనున్న 54 స్థానాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో 29 సీట్లు బీజేపీ గెలవగా, 11 సీట్లు ఎస్పీ, 6 బీఎస్పీ, 3 సీట్లు సుహెల్దేవ్ పార్టీ గెలుచుకున్నాయి. మరోవైపు నిషాద్ పార్టీకి 1 సీటు దక్కింది. 2017 ఎన్నికల్లో సుహెల్దేవ్ పార్టీ బీజేపీతో పోటీ చేసినా, ఈసారి మాత్రం అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీతో పోటీ చేసింది.
యూపీ అసెంబ్లీ ఎన్నికల 7వ, చివరి దశ కోసం అజంగఢ్‌లో ఓటింగ్ ప్రారంభమైంది. నరౌలిలోని ఉచ్ ప్రాత్మిక్ విద్యాలయం పోలింగ్ బూత్ నంబర్ 231 వద్ద ఓటేసేందుకు ఓటర్లు బారులు తీరారు.
#UttarPradeshElections2022 | Voting begins in Azamgarh, for the 7th & last phase of the state Assembly elections.
Visuals from polling booth number 231, Uchh Prathmik Vidyalaya in Narauli pic.twitter.com/wBVUiEik98
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 7, 2022
ఏడో దశ ఎన్నికల్లో 2 కోట్ల 6 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1.10 కోట్ల మంది పురుషులు, 96 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 1017 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కూడా ఉన్నారు.
Voting for the 7th & final phase of #UttarPradeshElections2022 begins; 613 candidates across 54 assembly seats in 9 districts are in fray.
Counting of votes on 10th March. pic.twitter.com/EvP1kk2zBP
— ANI (@ANI) March 7, 2022
ఉత్తరప్రదేశ్ ఎన్నికల చివరి దశ పోలింగ్ ప్రారంభమైంది. వారణాసి నియోజకవర్గం పరిధిలోని నివేదిత శిక్షా సదన్ బాలికా ఇంటర్ కాలేజీ పోలింగ్ బూత్ నంబర్ 97లో ఓటేసేందుక ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా మాక్ పోలింగ్ నిర్వహించారు.
Varanasi, UP | Mock polling begins for the final phase of #UttarPradeshElections.
Visuals from polling booth number 97 of Nivedita Shiksha Sadan Balika Inter College pic.twitter.com/ThR5zf3wsH
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 7, 2022
ఈరోజు ఏడో దశలో ఓటింగ్ జరుగుతున్న 54 స్థానాల్లో వారణాసి, ఘాజీపూర్, చందౌలీ, జాన్పూర్, అజంగఢ్, మౌ, మీర్జాపూర్, సోన్‌భద్ర, భదోహి జిల్లాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో పోలింగ్ జరుగుతోంది.
Published On - Mar 07,2022 6:48 AM