TSRTC: ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. పూర్తివివరాలివే..
TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజా రవాణాలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజా రవాణాలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు సజ్జనార్. ప్రయాణికులను ఆకట్టుకోవడంలో భాగంగా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలకు చేపట్టిన టీఎస్ఆర్టీసీ.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సాధారణంగా సుదూర ప్రయాణం చేసే ప్రయాణికులు.. రోడ్డు పక్కన దాబాల వద్ద ఆపి టీ, కాఫీ, స్నాక్స్ తీసుకుంటుంటారు. మరికొందరు బస్సుకోసం ఎదురు చూస్తున్న సమయంలో టీ, స్నాక్స్ తీసుకుంటారు. అయితే, ఇప్పుడు ఆ అవసరం లేకుండా.. అన్నీ ఆర్టీసీనే ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.
ఆ ప్రత్యేక ఏర్పాట్లు ఏంటంటే.. హైదరాబాద్ నుంచి దూర ప్రయాణం చేసే ప్రయాణికులు బస్ స్టేషన్లలో బస్సుల కోసం సాధారణంగానే ఎదురు చూస్తుంటారు. అయితే, గరుడ, రాజధాని బస్సుల కోసం బస్ స్టేషన్లలో ఎదురు చూసే ప్రయాణికులకు సాయంత్రం 4 నుంచి చివరి బస్సు వరకు కాఫీ, టీ, స్నాక్స్, తాగునీరు అందజేయనున్నట్లు ప్రకటించింది ఆర్టీసీ. ఈ మేరకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, ఈ నెల 7వ తేదీ నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని, ఎల్బీనగర్, మియాపూర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్, టెలిఫోన్ భవన్, కాచిగూడ సహా పలు బస్‌స్టాపుల్లో ఈ సదుపాయం ఉంటుందని చెప్పారు.
Also read:
Drugs Smuggling: గత మూడేళ్లలో రూ.2,170 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్! ఈ దాయాది దేశం నుంచే సరఫరా..
రంపపు కొడవలితో దాడి చేసి.. కిందపడేసి గొంతు కోసి దారుణం.. అసలేం జరిగిందంటే
Shane warne: స్పిన్ దిగ్గజం గదిలో రక్తపు మరకలు.. థాయ్ పోలీసులు ఏం చెబుతున్నారంటే..