Hyderabad:హైదరాబాద్ వాసులకు శుభవార్త.. అందుబాటులోకి రానున్న పాదచారుల వంతెనలు

హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్రాఫిక్ రోజురోజుకు పెరుగుతోంది. రహదారులన్నీ నిత్యం రద్దీగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రోడ్డు దాటేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు దాటే క్రమంలో కొన్ని సార్లు...

Hyderabad:హైదరాబాద్ వాసులకు శుభవార్త.. అందుబాటులోకి రానున్న పాదచారుల వంతెనలు
Foot Over Bridge
Follow us

|

Updated on: Mar 24, 2022 | 7:40 AM

హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్రాఫిక్ రోజురోజుకు పెరుగుతోంది. రహదారులన్నీ నిత్యం రద్దీగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రోడ్డు దాటేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు దాటే క్రమంలో కొన్ని సార్లు ప్రమాదాలకూ గురవుతున్నారు. వీరి కష్టాలను గుర్తించిన అధికారులు పలు చోట్లు ఫుట్ఓవర్ బ్రిడ్జీలు (Foot Over Bridge) నిర్మించారు. ఈ క్రమంలో నగరంలోని చందానగర్ లో పాదాచారులు ప్రమాదాలకు గురి కాకుండా రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మించారు. దీప్తి శ్రీ నగర్ ఎంట్రన్స్ ఎదురుగా జాతీయ రహదారి 65 పై రూ.5.5 కోట్లు, పీజేఆర్ ఎన్ క్లేవ్ వద్ద రూ. 5.2 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెనలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు బ్రిడ్జీలను గురువారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ విప్ శేర్ లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ లు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 4 ప్యాకేజీల ద్వారా రూ. 127.3 కోట్లు వ్యయంతో 21 ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు. శేర్ లింగంపల్లిలో రూ. 39.70 కోట్ల వ్యయంతో 5 వంతెన పనులను ప్రతిపాదించారు. అందులో రెండు పూర్తయ్యాయి. మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి.

చందానగర్ లో ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలతో పాదచారులకు జాతీయ రహదారి 65 దాటడం సులభతరం కానుంది. కమర్షియల్, కాలేజీ విద్యార్థులు అంతే కాకుండా చందానగర్ హఫీజ్ పేట్ ఆదర్శనగర్, రామకృష్ణ నగర్, ద్వారకా నగర్, మదీనగూడ కాలనీ వాసులకు దీప్తి శ్రీ సాగర్, ఎఫ్ఓబీతో ప్రయోజనం కలుగుతుంది. పీజేఆర్ పై వంతెనతో ఇక్రిశాట్, అపర్ణ టవర్స్, హుడా కాలనీ, ఆర్టీసీ కాలనీ వాసులకు ఉపయుక్తంగా ఉంటుంది. మెట్లు ఎక్కలేని వయో వృద్ధుల కోసం ఎస్కలేటర్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు.

Also Read

IPL 2022: ఐపీఎల్‌ ఛాన్స్ కోల్పోయాడు.. సఫారీలకు చుక్కలు చూపించాడు..

బాలీవుడ్‌ను కడిగిపారేసిన ఆర్జీవీ !! కాశ్మీర్ ఫైల్స్ పై వర్మ కామెంట్స్ !!

ఇలాంటి టైంలో భార్యతో జాగ్రత్త !! తేడా వస్తే అంతే !!

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో