Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరో మలుపు.. తెలంగాణ సీఎస్, ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు!
అనేక మలుపు తిరిగిన టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై సీరియస్‌గా ఫోకస్ పెట్టింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్. తాజాగా తెలంగాణ సీఎస్ సోమేష్‌కుమార్, ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌లపై ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.
Tollywood Drugs Case: ఇప్పటికే అనేక మలుపు తిరిగిన టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై సీరియస్‌గా ఫోకస్ పెట్టింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(Enforcement Directorate). తాజాగా తెలంగాణ(Telangana) సీఎస్ సోమేష్‌కుమార్(Somesh Kumar), ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌లపై ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాలను పాటించలేదని, తమకు కావాల్సిన సమాచారం ఇవ్వలేదని ఈడీ పేర్కొంది. కేసు విచారణకు సహకరించేలా వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ కోరిన వివరాలు ఇవ్వాలని ఫిబ్రవరి 2న తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. అయితే హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్లను పేర్కొంటూ హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఈడీ అధికారులు తన పిటిషన్‌లో ప్రస్తావించారు.
దీంతో సోమేశ్‌కుమార్, సర్ఫరాజ్ అహ్మద్‌కు ఈనెల 13న న్యాయవాది ద్వారా నోటీసు పంపించినట్లు తెలిపింది. వారిద్దరిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఈడీ కోరింది. దీంతో టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరో మలుపు తిరిగినట్టయింది. హైకోర్టు ఆదేశించినా తెలంగాణ సీఎస్ డ్రగ్స్ కేసులో డిజిటల్ డేటా ఎందుకు ఇవ్వలేదు ? జాప్యం ఎక్కడ జరిగింది? అటు ఎక్సైజ్‌శాఖ కూడా వివరాలు ఎందుకు ఇవ్వలేదనేది తేలాల్సి ఉంది. ఈడీ పిటిషన్ తర్వాత తెలంగాణ సీఎస్, ఎక్సైజ్‌శాఖ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Read Also… హైదరాబాద్ వాసులకు శుభవార్త.. అందుబాటులోకి రానున్న పాదచారుల వంతెనలు