Crime news: యువకునికి ఘోర అవమానం.. హిందూ దేవుళ్లను కించపరుస్తూ పోస్టు పెట్టాడని ఏం చేశారంటే
కుల, మత, లింగ బేధాలు లేకుండా మనమందరం ఒక్కటే అన్న భారత స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది. సమాజంలో(Society) ఉన్నత స్థాయికి చెందిన వారు ఇప్పటికీ కింది స్థాయి కులాల వారిపై దాడులకు పాల్పడుతూనే
కుల, మత, లింగ బేధాలు లేకుండా మనమందరం ఒక్కటే అన్న భారత స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది. సమాజంలో(Society)కింది స్థాయి కులాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంతే కాకుండా సోషల్ మీడియాలో(Social Media) నూ కుల వివక్ష రోజురోజుకు పెరుగిపోతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా పేరు సాధించిన ది కశ్మీర్ ఫైల్స్ అనే చిత్రం కూడా కొన్ని చోట్ల వివాదాలకు కారణమవుతోంది. తాజాగా రాజస్థాన్ (Rajasthan) లో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ చిత్రాన్ని ఉద్దేశించి, హిందూ దేవుళ్లను వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టిన దళిత యువకుడిపై కొందరు అమానుషంగా ప్రవర్తించారు. అతనితో బలవంతంగా ముక్కు నేలకు రాయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లా బెహ్రార్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రాజేశ్ కుమార్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాను విమర్శిస్తూ మూడు రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. దీనిపై కొందరు కామెంట్లు చేశారు. వాటికి రిప్లై ఇస్తూ హిందూ దేవుళ్లను కించపరుస్తూ రాజేశ్ మళ్లీ పోస్టులు పెట్టాడు.
ఈ పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు వ్యక్తులు రాజేశ్ కుమార్‌ను గుడికి పిలిపించారు. బలవంతంగా క్షమాపణలు చెప్పించారు. తప్పు ఒప్పుకోవాలంటూ బలవంతంగా ముక్కు నేలకు రాయించారు. హిందూ దేవుళ్లను విమర్శించాడని గుడిలో ఓ దళితుడితో ముక్కు నేలకు రాయించారని స్థానిక పోలీసులు చెప్పారు. ఈ సంఘటనకు కారకులైన 11 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి.
అమ్మాయిలు ఇలాంటి అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు.. కానీ ఈ రహస్యాలు ఎవ్వరికీ చెప్పరు..