అమ్మాయిలు ఇలాంటి అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు.. కానీ ఈ రహస్యాలు ఎవ్వరికీ చెప్పరు..
సాధారణంగా అమ్మాయిలు తమ మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోరు. ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా..
సాధారణంగా అమ్మాయిలు తమ మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోరు. ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా.. వారితో స్నేహం చేయడానికి సుముఖత చూపించరు. మనసులోని మాటలను.. ఆలోచనలను పంచుకోని అమ్మాయిలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు తమ ఇష్టాలను.. అయిష్టాలను చాలా తక్కువ మందితో పంచుకుంటారు. ఎప్పుడూ వారికి సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచుకునేందుకు ఇష్టపడతారు. అమ్మాయిలతో స్నేహం చేయాలనుకునే వారు ముందుగా వారి మనస్తత్వాలను తెలుసుకోవాలని అంటుంటారు. వారు తమ రహస్యాలను ఎవరితో పంచుకుంటారు.. ఏ విషయాలను ఎలా అర్థం చేసుకుంటారు వారితో స్నేహం ఎలా చేయాలనే విషయాలపై అవగాహానకు వస్తే.. వారితో స్నేహం ఎక్కువ కాలం బలంగా ఉంటుంది.. అలాగే.. అమ్మాయిలు వారి మనసులోని మాటలను ఏ ఎవరితో పంచుకుంటారు.. అబ్బాయిల గురించి వారి మనసులో ఉండే ఆలోచనలు… ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారో తెలుసుకోండి.
నివేదికల ప్రకారం.. అమమ్మాయిలు కళ్లతో మాట్లాడే అబ్బాయిలను ఇష్టపడతారు. కళ్లలోకి చూస్తూ మాట్లాడే అబ్బాయిలు.. ఎంతో నిజాయితీగా.. ఆత్మవిశ్వాసంతో ఉంటారని.. అందుకే అలాంటి అబ్బాయిలను ఇష్టపడతారు. నేలవైపు చూస్తూ మాట్లాడటం.. లేదా చుట్టు పక్కల చూస్తూ మాట్లాడేవారిని అస్సలు ఇష్టపడరు.
ప్రతి విషయాన్ని జడ్జ్ చేసే అబ్బాయిలను అస్సలు ఇష్టపడరు. నేటి కాలంలో అబ్బాయిలు అమ్మాయిలను జడ్జ్ చేయకూడదు. అలాగే వారికి రూల్స్ పెట్టడం..చేసే ప్రతి పనికి అడ్డు చెప్పే అబ్బాయిలను అస్సలు ఇష్టపడరు.. అబ్బాయిల మాట తీరును ప్రవర్తనను చూసి అమ్మాయిల ఉద్దేశ్యం మారుతుంది.
అమ్మాయిలు సర్ప్రైజ్లను.. ఆశ్చర్యాలను ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఈ విషయాలను వారు ఎప్పటికీ బయటపెట్టరు. ప్రతి అమ్మాయి సర్ ప్రైజ్ లను ఇష్టపడుతుంది. స్నేహితురాలు.. భార్య… సోదరి.. ఎవరైనా సరే..సర్ ప్రైజ్ ఇష్టపడుతుంది. అమ్మాయిలతో ఎక్కువగా బాండింగ్ ఏర్పడాలంటే.. వారికి ఎప్పటికప్పుడూ చిన్న చిన్న సర్ ప్రైజెస్ ఇస్తుండాలి.
సంతోషంగా.. జాయ్ ఫుల్ గా ఉండే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు.. ఎప్పుడూ విచారంగా.. తమ కష్టాలను చెప్పుకుంటూ ఉండే అబ్బాయిలను ఇష్టపడరు. ఒకవేళ మీరు మీ సమస్యలను కూడా ఎక్కువగా అమ్మాయిల ముందు చెప్పుకుంటే వెంటనే మీ స్వభావాన్ని మార్చుకోవాలి. ఎప్పుడూ ఫన్నీగా జోక్స్ చేస్తూ సంతోషంగా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారు.
అమ్మాయిలకు ఎప్పుడూ గౌరవంగా మాట్లాడే అబ్బాయిలు అంటే ఇష్టం ఉంటుంది.. ఈ విషయాన్ని వారు బయటకు చెప్పరు. కానీ…ఇతరులకు గౌరవం ఇస్తూ మాట్లాడే అబ్బాయిలను ఎప్పుడూ గమనిస్తుంటారు. అంతేకాకుండా.. మహిళలతో గౌరవంగా నడుచుకోవడం.. వారితో గౌరవంగా మాట్లాడే వారిని ఎక్కువగా ఇష్టపడతారు..
గమనిక:- ఈ కథనం కేవలం ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.
Salman Khan: మళ్లీ చిక్కుల్లో సల్మాన్ ఖాన్.. ఆ ఇద్దరికీ సమన్లు జారీ చేసిన కోర్టు..