Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSSPDCL Jobs: నిరుద్యోగులారా మీకో గుడ్‌న్యూస్‌.. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో ఉద్యోగాలకు ప్రకటన.. ఎన్ని పోస్టులంటే..

తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. పరీక్షలను కూడా నిర్వహించింది. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు నిరుద్యోగులకు ఊరటనిస్తూ..టీఎస్​ఎస్​పీడీసీఎల్ మరో ప్రకటన చేసింది.. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదలైంది.

TSSPDCL Jobs: నిరుద్యోగులారా మీకో గుడ్‌న్యూస్‌.. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో ఉద్యోగాలకు ప్రకటన.. ఎన్ని పోస్టులంటే..
Tsspdcl Notification
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 03, 2023 | 1:13 PM

నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ నిరుద్యోగులకు మాత్రమే ఈ గుడ్‌న్యూస్‌. తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(TSSPDCL)లో భారీగా కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. పరీక్షలను కూడా నిర్వహించింది. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు నిరుద్యోగులకు ఊరటనిస్తూ..టీఎస్​ఎస్​పీడీసీఎల్ మరో ప్రకటన చేసింది.. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో ఖాళీగా ఉన్న1,601 పోస్టులను భర్తీ చేసేందుకు గానూ సంస్థ ఉద్యోగ ప్రకటన చేసింది.

Tsspdcl

తాజా ప్రకటనలో భాగంగా మొత్తం 1601 ఉద్యోగాలు ఉండగా ఇందులో… 1,553 జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం), 48 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఎలక్ట్రికల్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రారంభం, ఖాళీల వివరాలను ఫిబ్రవరి 15వ తేదీన పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో వెల్లడించనున్నట్లు TSSPDCL ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదలైంది. పూర్తి వివరాల కోసం https://tssouthernpower.cgg.gov.in వెబ్ సైట్‌ను చూసి తెలుసుకోవచ్చు.

– జూనియర్‌లైన్‌ మ్యాన్‌ ఉద్యోగాలకు పదో తరగతితో పాటు ఐటీఐ, ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. జూనియర్ లైన్‌మెన్‌ ఖాళీలకు రాత పరీక్షతో పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. వయో పరిమితి 18 నుంచి 35 ఏళ్లు. వేతన శ్రేణి రూ.రూ.24340- రూ.39405గా నిర్ణయించారు.

-అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలకైతే ఇంజినీరింగ్‌లో సంబంధిత డిగ్రీ ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండొచ్చు. వేతనశ్రేణి రూ. రూ.64,295- రూ.99,345గా నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..