Milk Prices Hike: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన పాల ధరలు.. ఆ బ్రాండ్‌పై..
2021 చివరలో లాక్‌డౌన్ ప్రారంభమైన వెంటనే, పాల సరఫరాతో పోలిస్తే డిమాండ్ గణనీయంగా పెరిగింది. అధిక డిమాండ్, పాల ఉత్పత్తి తగినంత లేకపోవడంతో ధరలు పెరిగాయి.
అమూల్ పాల ధర (ఫిబ్రవరి3) శుక్రవారం నుంచి మళ్లీ పెరిగింది. అమూల్ బ్రాండ్‌కు ప్రసిద్ధి చెందిన గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) ఈ విషయాన్ని తెలియజేసింది. అమూల్ మిల్క్ ప్యాక్‌ల అన్ని వేరియంట్లలో లీటరుకు రూ. 3 చొప్పున పెంచబడింది. ఫిబ్రవరి 3, 2023 ఉదయం నుండి పెరిగిన ధరలు అమలులోకి వచ్చేలా సవరించబడిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గత 10 నెలల్లో పాల ధర రూ.12 పెరిగింది. అంతకు ముందు సుమారు ఏడేళ్ల పాటు పాల ధర పెరగలేదు. ఏప్రిల్ 2013 నుంచి మే 2014 మధ్య పాల ధర లీటరుకు రూ.8 పెరిగింది.
వేసవిలో పాల ఉత్పత్తి తగ్గిపోవడంతో పాలను విక్రయించే కంపెనీలు పాడి రైతులకు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. అందుకే రానున్న రోజుల్లో పాల ధర మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మదర్ డెయిరీ ధర మార్చి 5, డిసెంబర్ 27, 2022 మధ్య లీటరుకు రూ.57 నుండి రూ.66కి పెరిగింది. టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ.6 పెరిగింది.
Amul has increased prices of Amul pouch milk (All variants) by Rs 3 per litre: Gujarat Cooperative Milk Marketing Federation Limited pic.twitter.com/At3bxoGNPW
— ANI (@ANI) February 3, 2023
2022 నుంచి పశుగ్రాసం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి.. అలాగే, కరోనా వైరస్ మహమ్మారి సమయంలో పాలను విక్రయించకపోవడం వల్ల పాడి రైతుల వద్ద పశువుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇది కాకుండా దేశంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించిన చర్మ నాడ్యూల్ వ్యాధి పశువులను చాలా ప్రభావితం చేసింది. ఈ వ్యాధి వేలాది ఆవులను చంపింది. దీని వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుంది. 2021 చివరలో లాక్‌డౌన్ ప్రారంభమైన వెంటనే, పాల సరఫరాతో పోలిస్తే డిమాండ్ గణనీయంగా పెరిగింది. అధిక డిమాండ్, పాల ఉత్పత్తి తగినంత లేకపోవడంతో ధరలు పెరిగాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..