Narendra Modi: 2019 నుంచి ప్రధాని మోడీ విదేశీ పర్యటనల కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా ?
ఇప్పటి వరకు ప్రధాని మోదీ 21 సందర్భాల్లో, ప్రెసిడెంట్ ఎనిమిదిసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ 86 విదేశీ పర్యటనలకు వెళ్లినట్టుగా చెప్పారు. ఇక ఖర్చులు ఎన్ని కోట్ల రూపాయలో తెలిస్తే మాత్రం..
2019 నుంచి ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోడీ 21 విదేశీ పర్యటనలు చేశారు. ఆయా టూర్ల కోసం అయిన ఖర్చులు ఎన్ని కోట్లో తెలుసా.? ఈ నాలుగేళ్ల కాలంలో ప్రధాని చేసిన పర్యటనలు, ఆయా వివరాలను స్వయంగా భారత ప్రభుత్వమే వెల్లడించింది. ప్రధాని మోడీ ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు, విదేశీ పర్యటనల కోసం ఎంత ఖర్చు అయింది అనే వివరాలను రాతపూర్వకంగా బహిర్గతం చేసింది ప్రభుత్వం. ఈ మేరకు రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు బదులుగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ గురువారం రాజ్యసభలో రాతపూర్వకంగా వివరించారు. మోడీ విదేశీ పర్యటనల కోసం రూ.22.76 కోట్లకు పైగా ఖర్చు చేశారని ప్రభుత్వం గురువారం వెల్లడించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2019 నుంచి ఇప్పటి వరకు 21 విదేశీ పర్యటనలు చేపట్టగా, ఈ పర్యటనల కోసం రూ.22.76 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ప్రభుత్వం గురువారం వెల్లడించింది. రాష్ట్రపతి ఎనిమిది విదేశీ పర్యటనలు చేశారు. 2019 నుండి ఈ పర్యటనల కోసం 6.24 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు, రాష్ట్ర మంత్రివిదేశీ వ్యవహారాలులో ఒక ప్రశ్నకు వి మురళీధరన్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారురాజ్యసభ.
విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ చెప్పిన వివరాల ప్రకారం ప్రధాని మోదీ విదేశీ పర్యటనల కోసం అక్షరాల రూ. 22,76,76,934 కోట్లు ఖర్చు కాగా, రాష్ట్రపతి విదేశీ పర్యటనల కోసం రూ. 6,24,31,424 ఖర్చయింది. అదే సమయంలో విదేశాంగ శాఖ మంత్రి విదేశీ పర్యటనల కోసం రూ. 20,87,01,475 వెచ్చించారు. 2019 నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ 21 సందర్భాల్లో, ప్రెసిడెంట్ ఎనిమిదిసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ 86 విదేశీ పర్యటనలకు వెళ్లినట్టు రాజ్యసభ సాక్షిగా వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లక్ చేయండి..