BRS: ఏపీలో పాగా వేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు.. కీలక నేతలపై దృష్టి సారించిన గులాబీ బాస్..
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన తర్వాత కె. చంద్రశేఖర్ రావు స్పెషల్ ఫోకస్ పెట్టింది. అంతా ఏపీ పైనే అని రాజకీయ విశ్లేషకులు అంచానా వేస్తున్నారు.
బీఆర్ఎస్ వ్యూహత్మకంగా ముందుకు వెళ్తోంది. ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పిటకే తోట చంద్రశేఖర్‌కు ఏపీ బాధ్యతలు అప్పగించిన గులాబీ బాస్.. ఫేస్ వాల్యూ నేతలకు పింక్ కండువా కప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగారు కుత్బుల్లాపూల్ ఎమ్మెల్యే వివేకానంద. గంటా శ్రీనివాస్, మాజీ జేడీ లక్ష్మినారాయణను వివేక్ కలవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఆ నేతలు గులాబీ కండువా కప్పుకోబోతున్నారా..? మరింత మంది ఏపీకి చెందిన నేతలు, విద్యా సంస్థల నిర్వాహుకులు, ఉద్యమకారులు బీఆర్ఎస్‌లో చేరబోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు.
ఇదిలావుంటే, బీఆర్‌ఎస్‌లో చేరే ఆలోచన లేదంటున్నారు గంటా శ్రీనివాస్. మర్యాదపూర్వక భేటీ అంటున్నారు మాజీ జేడీ లక్ష్మినారాయణ. వీరిని వివేకానంద గౌడ్ కలవడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. వారినే ఎందుకు కలిశారన్న చర్చ మొదలైంది.
కేసీఆర్ తన అడుగులను ముందుగా తెలంగాణ సరిహద్దు జిల్లలపై పెట్టినట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు సరిహద్దు జిల్లాలోని మాజీలను, అధికార పార్టీకి దూరంగా ఉంటున్న నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులోనూ ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే అక్కడి కీలక నేతలను కలుస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఎందుకంటే, తెలుగు రాష్ట్రం కావడం, పాత పరిచయాలు ఉండటం కారణంగా పార్టీ విస్తరణ, బలోపేతం సులువు అవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ నేతలను బీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అసంతృప్త నేతలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు. ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహించి, పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరిన్ని రాజకీయ వార్తల కోసం