K Viswanath: కళాతపస్వికి గోదావరి సెంటిమెంట్.. ఆయన సినిమాల్లో ఒక్క సన్నివేశమైనా..
గత కొన్ని సంవత్సరాల క్రితం వరకూ సినిమా షూటింగ్ అనగానే.. ముఖ్యంగా గ్రామీణ నేపధ్యం అనగానే దర్శక, నిర్మాతలకు ముందుగా గుర్తుకొచ్చేది గోదావరి నదీ తీర ప్రాంతమైన రాజమండ్రి.. అందాల లొకేషన్లకునెలవైన రాజమండ్రి నది తీరం వద్ద బ్యాక్‌డ్రాప్‌గా ఎన్నో సినిమాలు తీశారు.
కేరళకు ఏ మాత్రం తీసిపోని ప్రకృతి అందాలు గోదావరి సీమ సొంతం. పచ్చని చెట్లు.. పాపికొండలు.. ఉరుకుతూ ప్రవహిస్తూ.. కడలిలో కలయిక కోసం ఉరకలెత్తే పావని గోదారి.. తల్లి గోదావరి ఒడ్డున అందమైన నగరాలు.. సూర్య కిరణాలు సోకి.. వెండి వేదికలను తలపించే ఇసుక తిన్నెలు.. కనుల విందు చేసే గోదావరి పాపికొండల నడుమ సూర్యోదయం, సూర్యాస్తమయం.. అణువణువునా హరిత శోభలను అంద్దుకున్న నెలలు.. ఇంద్రధనస్సుని తలపించే పూల తేరులు..ఎగసిపడే నీలిసంద్రం.. సహజ సిద్ధమైన అందాల మణిహారం గోదావరి నదీమ తల్లి అంటే.. తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మక్కువ.
ఇప్పుడైతే ప్రకృతి అందాలు అంటూ కేరళ లేదా విదేశాలకు వెళ్తున్నారు కానీ.. గత కొన్ని సంవత్సరాల క్రితం వరకూ సినిమా షూటింగ్ అనగానే.. ముఖ్యంగా గ్రామీణ నేపధ్యం అనగానే దర్శక, నిర్మాతలకు ముందుగా గుర్తుకొచ్చేది గోదావరి నదీ తీర ప్రాంతమైన రాజమండ్రి..
అందాల లొకేషన్లకునెలవైన రాజమండ్రి నది తీరం వద్ద బ్యాక్‌డ్రాప్‌గా ఎన్నో సినిమాలు తీశారు. అందులో దర్శక దిగ్గజం కళాతపస్వి కె విశ్వనాథ్ ఒకరు. గౌతమీ నది ఒడ్డున ఒక కుటీరం.. రాజమండ్రిలో కొన్ని సన్నివేశాలు తప్పనిసరిగా విశ్వనాథ్ సినిమాల్లో ఉంటాయి. ఈ ప్రాంతంతో విశ్వనాథ్ కు ఎనలేని అనుబంధం ఉంది. అంతేకాదు తన సినిమాలో ఒక్కసన్నివేశమైన తీయడం ఆయనకు సెంటిమెంట్ అని కూడా అంటారు.
విశ్వనాథ్ కు కెరీర్ లో వెరీవెరీ స్పెషల్ గా నిలిచిన శంకరాభరణం సహా సూత్రధారులు, స్వయంకృషి , స్వాతిముత్యం, శృతిలయలు, ఆపద్బాంధవుడు, చిన్నబ్బాయి, శుభప్రదం, సిరిసిరిమువ్వ, ‘జీవన జ్యోతి’ , ‘జీవిత నౌక’ ‘సరదా’ వంటి అనేక సినిమాల షూటింగ్ ను ఈ ప్రాంతంలో చేశారు. ఈ ప్రాంతానికి చెందిన నటీనటులు, కళాకారులతోనే కాదు.. నాదీ తీరానికి గోదావరి తల్లితో ప్రత్యేక బంధం ఉంది. అందుకనే విశ్వనాథ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ను ప్రకృతి ప్రసాదించిన స్టూడియోగా పలు సందర్భాల్లో అభివర్ణించారు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..