AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankarabharanam: మూస పద్ధతికి బ్రేక్‌ వేసిన శంకరాభరణం సినిమా రిలీజై 43 ఏళ్లు పూర్తి.. నేటికీ సినీ ప్రేక్షకులను అలరిస్తున్న పాటలు..

ఆయన ఓ నిరం‌తర క‌ళా‌త‌పస్వి.‌ శంక‌రా‌భ‌ర‌ణాన్ని కంఠా‌భ‌ర‌ణంగా చేసు‌కున్న ఆ తపస్వి కాశీ‌నా‌థుని విశ్వనాథ్‌.‌ కాకతాళీయమో..యాధృచ్చికమో కానీ.. 43 ఏళ్ల కిందట శంకరాభరణం రిలీజైన ఫిబ్రవరి రెండునే..ఇప్పుడు ఆయన తుదిశ్వాస వదిలారు.

Surya Kala
| Edited By: |

Updated on: Feb 03, 2023 | 7:16 AM

Share

శంకరాభరణం.. కె.విశ్వనాథ్‌ సినీ జీవితంలోనే ఎంతో ప్రత్యేకమైనది ఈ సినిమా.. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వనాథ్‌ సినీ కెరీర్‌నే మార్చేసిన చిత్రం ఇది. విశ్వనాథ్‌ సినీ జీవితంలో మైల్‌స్టోన్‌గా నిలిచిపోయింది శంకరాభరణం. సంగీత ప్రధానంగా వచ్చిన ఈ మూవీ తెలుగు సినిమా దిశాదశనే మార్చేసింది. ఈ సినిమా రిలీజై సరిగ్గా 43ఏళ్లు కావొస్తోంది. కాకతాళీయమో లేక విధి విచిత్రమో… 43ఏళ్ల క్రితం శంకరాభరణం సినిమా రిలీజైన రోజునే కె.విశ్వనాథ్‌ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. 1980 ఫిబ్రవరి 2న శంకరాభరణం విడుదలైతే… 2023 ఫిబ్రవరి 2న విశ్వనాథ్ కన్నుమూశారు.

అప్పటివరకున్న ట్రెండ్‌కి భిన్నంగా తెరకెక్కింది శంకరాభరణం. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా.. తెలుగు సినిమాకు సరికొత్త దారి చూపించింది. తెలుగు సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది శంకరాభరణం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, కళలకు పట్టంకడుతూ తెరకెక్కిన శంకరాభరణం సినిమాలో పాటలు కూడా చరిత్రలో నిలిచిపోయాయి.

1980లో విడుదలైన శంకరాభరణం సినిమా ఒక పెను సంచలనం. ఈ సినిమాలోని సంగీతం, సాహిత్యం ఇప్పటికీ వీనుల విందు చేస్తాయ్‌. విశ్వనాథ్‌ దర్శకత్వ నైపుణ్యాన్ని గొప్పగా ఆవిష్కరించిన సినిమా ఇది. శంకరాభరణం సినిమాలోని పాటలు తెలుగు సినిమా రూపురేఖల్నే మార్చేశాయి. సినీ ప్రియులకు సరికొత్త అనుభూతిని పంచుతూ ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో అజరామరంగా నిలిచిపోయిన చిత్ర రాజసం శంకరాభరణం సినిమా.

ఇవి కూడా చదవండి

తన ప్రతి సినిమాను ఒక అద్భుత కళారూపంగా మలిచేవారు విశ్వనాథ్‌. అప్పటివరకున్న మూస పద్ధతికి బ్రేకేస్తూ, భిన్నంగా సినిమాలు తీస్తూ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్న గొప్ప దర్శకుడు విశ్వనాథ్‌. అందుకే, కాలాన్ని, మారుతున్న అభిరుచుల్ని తట్టుకుని ఇప్పటికీ గొప్ప సినిమాగా నిలిచిపోయింది శంకరాభరణం

శంకరాభరణం సినిమాలో పాటలే కాదు సంభాషణలు కూడా ప్రేక్షకులను కట్టిపడేశాయి. జనాలను  విపరీతంగా అలరించాయి. శంకరశాస్త్రి కేరెక్టర్‌ను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదంటే శంకరాభరణం సినిమా ఎంత బలమైన ముద్ర వేసిందో అర్ధంచేసుకోవచ్చు.

విశ్వనాథ్‌ సినిమాలన్నీ కథాకథనాలు సున్నితంగానే ఉంటాయి. కానీ, బలమైన అంశాలను తన సినిమాల్లో చర్చిస్తారు. సాంఘిక దురాచారాలను, పశుప్రవృత్తిని ఎండగడతారు. మన సంస్కృతి సంప్రదాయాలను గుర్తుచేస్తారు. మనలోని సున్నిత భావాలను మేల్కొలిపే ప్రయత్నం చేస్తారు. ఆకాంక్షలు, ఆశయాలు, విలువలను ముందు తరాలకు అందించే ప్రయత్నం చేస్తారు. శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి కేరెక్టర్‌ అలాగే ఉంటుంది. అందుకే, కాలాన్ని, మారుతున్న అభిరుచుల్ని తట్టుకొని ఇప్పటికీ ఒక గొప్ప సినిమాగా ప్రజాదరణ పొందుతోంది శంకరాభరణం.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..