AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Assembly: పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది.. కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్‌ తమిళసై..

కాళోజీ కవితతో గవర్నర్‌ తమిళసై తన ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ వార్షిక బడ్జెట్‌ 2023 సమావేశాలు..

Sanjay Kasula
| Edited By: Janardhan Veluru|

Updated on: Feb 03, 2023 | 6:19 PM

Share

పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని చాటిన ప్రముఖ కవి కాళోజీ నారాయణ రావు కవితతో తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ .  సంక్షేమ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందుందని.. తెలంగాణ గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని తెలిపారు. వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించాం. కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోనే పూర్తి చేశామన్నారు. రైతు బంధు పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందన్నారు. ఇప్పటివరకూ రూ.65 వేల కోట్లు రైతులకు అందించామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి. ప్రభుత్వ కృషి వల్ల 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నాం. నీటి కోసం గతంలో గొడవలు జరిగాయి.. ఇప్పుడు 24 గంటల పాటు నీటి సరఫరా అందిస్తున్నామన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.

ఈ ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు గవర్నర్‌ తమిళిసై. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు..కలెక్టర్‌ ప్రమేల సత్పతి, ఇంచార్జ్‌ ఈవో రామకృష్ణారావు గవర్నర్‌కు స్వాగతం పలికారు. తూర్పు త్రితల రాజగోపురం వద్ద తమిళిసైకి పూర్ణకుంభ స్వాగతం పలికారు అర్చకులు. దర్శనానంతరం ఆశీర్వచనాలు అందించారు.

ఇక కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు గవర్నర్‌. కొంతకాలంగా రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య విభేదాల నేపథ్యంలో..గవర్నర్‌ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.