AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

K.A.Paul: ఆరోజు సచివాలయం ప్రారంభోత్సవం వద్దు.. గన్ పార్క్ వద్ద కె ఏ పాల్ హల్ చల్

అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్లనివ్వరా.. మొన్న సెక్రటరియెట్ వెళ్తే అడ్డుకున్నారంటూ నిరసనకు దిగారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. తెలంగాణలో ఈ గుండాయిజం ఎంటి..? నన్ను తెలంగాణాలో

K.A.Paul: ఆరోజు సచివాలయం ప్రారంభోత్సవం వద్దు.. గన్ పార్క్ వద్ద కె ఏ పాల్ హల్ చల్
Ka Paul
Sanjay Kasula
|

Updated on: Feb 03, 2023 | 1:10 PM

Share

అసెంబ్లీ గన్ పార్క్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్ చల్ చేశారు. అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్లనివ్వరా.. మొన్న సెక్రటరియెట్ వెళ్తే అడ్డుకున్నారంటూ నిరసనకు దిగారు  కేఏ పాల్. తెలంగాణలో ఈ గుండాయిజం ఎంటి..? నన్ను తెలంగాణాలో బ్యాన్ చేద్దామని అనుకుంటున్నారా..? అంబేడ్కర్ సెక్రటేరియట్‌ని కేసీఆర్ పుట్టినరోజు ఓపెన్ చేయడం ఎంటి..? వాస్తు బాగాలేదని సెక్రటేరియట్ కులగొట్టడం ఎంటి? అంటూ ప్రశ్నించారు. నేను వద్దన్నాను, దేవుడు వద్దు అనుకున్నాడు. అందుకే సెక్రటేరియట్ కాలిపోయింది.

నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. దేవుడు కూడా కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉన్నాడు. దేవుడికి నచ్చకనే సెక్రటరీయెట్ కి వ్యతిరేకంగా నిలబడ్డాడు. అవినీతి ఎంతో కాలం చెల్లదంటూ విమర్శించారు.  కేసీఆర్ ఇప్పటికైనా పశ్చాత్తాపడాలి.. మారాలంటూ సూచించారు. కేసీఆర్ ఈసారి ముఖ్యమంత్రిగానే గెలవలేడు.. ప్రధాని ఏం అవుతాడా అంటూ ఎద్దేవ చేశారు.

అంబేడ్కర్ జయంతి రోజే సెక్రటేరియట్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పేరు ఒకరిది.. పండుగా ఒకరిదా? అంటూ మండిపడ్డారు. సచివాలయం ప్రారంభంపై హైకోర్టులో పిల్ వేసాను. హైకోర్టు చీఫ్ జస్టిస్ వద్ద నా వాదనలు వినిపించానంటూ విమరించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభంపై హైకోర్టులో కెఏ పాల్ పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ నూతన సచివాలయం కేసీఆర్ పుట్టినరోజు ప్రారభించడాన్ని సవాలు చేస్తూ కెఏ పాల్ హైకోర్టులో పిల్ వేశారు. ఏప్రిల్ 14 న అంబేద్కర్ పుట్టినరోజు నాడు నూతన సచివాలయం ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.

నూతన సచివాలయంకు అంబేద్కర్ పేరు పెట్టిన కేసీఆర్ అంబేద్కర్ పుట్టినరోజు నాడు సచివాలయం ప్రారంభించాలని పిల్ దాఖలు చేశారు. ప్రతి వాదులుగా సీఎంఓ, చీఫ్ సెక్రటరీలను చేర్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!