AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెగించిన దొంగ.. ప్రయాణికులతో సహా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు..

Telangana: వేములవాడ బస్టాండ్ హైదరాబాద్ పాయింట్ లో పార్క్ చేసి ఈ బస్సు హైదరాబాద్‌ వెళుతుందని చెప్పి కొందరు ప్రయాణికులను బస్సులో ఎక్కించుకున్నాడు.. అక్కడ నుండి హైదరాబాద్‌కు బయల్దేరాడు. కొందరు ప్యాసింజర్లు టికెట్ తీసుకోమని డ్రైవర్‌ని అడుగగా,.. మార్గ మధ్యలో కండక్టర్ వస్తాడని, అతను టికెట్ తీసుకుంటాడని చెప్పాడా దొంగ. తంగళ్లపల్లి మండలం సారంపెల్లి నేరెళ్ల గ్రామ శివారు మార్గం మధ్యలో..

G Sampath Kumar
| Edited By: |

Updated on: Sep 11, 2023 | 4:14 PM

Share

కరీంనగర్,సెప్టెంబర్ 11: తెగించిన దొంగలు ఎలాంటి నేరాలకైనా వెనుకడుగు వేయటం లేదు.. ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగిలించాడు ఓ దొంగ. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట డిపో నుండి ఓ దొంగ e ఆర్టీసీ బస్ ను దొంగిలించాడు. అక్కడినుండి వేములవాడ చేరుకున్నాడు. వేములవాడ బస్టాండ్ హైదరాబాద్ పాయింట్ లో పార్క్ చేసి ఈ బస్సు హైదరాబాద్‌ వెళుతుందని చెప్పి కొందరు ప్రయాణికులను బస్సులో ఎక్కించుకున్నాడు.. అక్కడ నుండి హైదరాబాద్‌కు బయల్దేరాడు. కొందరు ప్యాసింజర్లు టికెట్ తీసుకోమని డ్రైవర్‌ని అడుగగా,.. మార్గ మధ్యలో కండక్టర్ వస్తాడని, అతను టికెట్ తీసుకుంటాడని చెప్పాడా దొంగ. తంగళ్లపల్లి మండలం సారంపెల్లి నేరెళ్ల గ్రామ శివారు మార్గం మధ్యలో బస్సులో డీజిల్ అయిపోవడంతో బస్సును, ప్రయాణికులను మార్గ మధ్యలోనే వదిలేసి పారిపోయాడు.

బస్సుల్లోంచి ప్రయాణికుల్ని దింపేసిన దొంగ డ్రైవర్‌.. ఈ బస్ లో డీజిల్ అయిపోయిందని మీరు వేరే బస్ ఎక్కి పోవాలని చెప్పాడు. చేసేది ఏమీ లేక ప్రయాణికులు మరో బస్సేక్కి వెళ్లిపోయారు. వాళ్లతో పాటుగానే.. ఆ దొంగ డ్రైవర్‌ కూడా బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు.. స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన అధికారులు.. ఆరా తీయగా ఆ బస్సు..సిద్దిపేట డిపోకి చెందినదిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. బస్సు దొంగ కోసం.. పోలీసులు ముమ్మరంగా గాలుస్తున్నారు. ఆ దొంగోడి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన మరీ చుట్టుపక్కల ప్రాంతాలు జల్లెడ పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

తెలివిగా కాపీ కొట్టాం అనుకున్నారు.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి
తెలివిగా కాపీ కొట్టాం అనుకున్నారు.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి
లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే
లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే
200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?
200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో