School Holidays: స్కూల్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఆగస్టు 29, 30 తేదీల్లో పాఠశాలలకు సెలవు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు విద్యాసంస్థలకు సర్కార్ రెండు రోజులు వరుసగా సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ముందస్తు సమాచారం ఇస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఆదేశాలు..
హైదరాబాద్, జులై 17: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు విద్యాసంస్థలకు సర్కార్ రెండు రోజులు వరుసగా సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ముందస్తు సమాచారం ఇస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో ఈ రెండు రోజుల సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు ఆ రెండు రోజుల్లో సర్కార్ సెలవులు ప్రకటించింది.
దాదాపు 5.5 లక్షల మంది అభ్యర్ధులు గ్రూప్ 2 పరీక్షలకు హాజరవుతున్నారు. వీరందరికీ ఆఫ్‌లైన్ విదానంలో పరీక్షలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయంచింది. ఐతే ఆయా తేదీల్లో పరీక్ష కేంద్రాలుగా ఉన్న విద్యాసంస్థలు ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు, పాఠశాల విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.